తెలంగాణ

telangana

ETV Bharat / business

Upcoming Cars In 2024 : అదిరిపోయే ఫీచర్స్​.. సూపర్ మైలేజ్​తో.. కొత్త ఏడాదిలో 24 నయా కార్స్​ లాంఛ్​! - upcoming Volkswagen cars in 2024

Upcoming Cars In 2024 In Telugu : భారత్​లో కార్ల వినియోగం బాగా పెరుగుతోంది. అందుకే ఈ డిమాండ్​ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే తమ లేటెస్ట్ మోడల్ కార్లను ఇండియన్ మార్కెట్​లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరి 2024లో లాంఛ్ కానున్న కార్స్​పై మనమూ ఓ లుక్కేద్దామా?

Upcoming Cars In 2024
Upcoming EV Cars In 2024

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 3:06 PM IST

Upcoming Cars In 2024 : కార్​ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. 2024లో ఇండియన్​ మార్కెట్​లో టాప్ బ్రాండెడ్ కార్స్​ లాంఛ్ కానున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. New Gen Maruti Suzuki Swift
భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి.. 2024 ఫిబ్రవరిలో న్యూ జనరేషన్ మోడల్​ Swift కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారులో 1.2 లీటర్ హైబ్రీడ్​ పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారని.. దీని ప్యూయెల్ ఎఫీషియన్సీ.. లీటర్​కు 35 కి.మీ అని సమాచారం. అంతేకాదు ఈ అప్​కమింగ్ కారులో పలు ఇంటీరియర్, ఎక్స్​టీరియర్ మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా టోక్యో మోటార్ షోలో ఈ హ్యాచ్​బ్యాక్​ కారును ఆవిష్కరించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్​

2. New Gen Maruti Suzuki Swift Dzire
మారుతి సుజుకి కంపెనీ బహుశా 2024 మార్చిలో ఈ స్విఫ్ట్​ డిజైర్ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిలో 1.2 లీటర్ హైబ్రీడ్ ఇంజిన్​ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు కూడా మారుతి స్విఫ్ట్​ తరహా డిజైన్​ను కలిగి ఉంటుందని సమాచారం.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్​

3. Maruti Suzuki 7 Seater SUV
ఈ మారుతి ఎస్​యూవీని 2024 అక్టోబర్​లో విడుదల చేసే అవకాశం ఉంది. Grand Viatra బేస్​ మోడల్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఎస్​యూవీ కారు.. టాటా సఫారీ, ఎంజీ హెక్టార్​ ప్లస్​, హ్యుందాయ్​ అల్కాజర్​, మహీంద్రా ఎక్స్​యూవీ700తో నేరుగా పోటీ పడనుంది.

4. Toyota Taisor (Fronx Based Subcompact SUV)
టయోటా టైసర్​ 2024 ఫిబ్రవరిలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారులో 1.2 లీటర్​ K12C ఇంజిన్ అమరుస్తున్నారు. ఇది పెట్రోల్​, సీఎన్​జీ వేరియంట్లతో వస్తుంది. అలాగే 1.0 లీటర్​ బూస్టర్​జెట్​ టర్బో పెట్రోల్ మోటార్​ వేరియంట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ కారులో బంపర్స్​, ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్​ వీల్స్ డిజైన్​లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

5. Toyota Fortuner
భారత్​ ఎస్​యూవీ టయోటా ఫార్చ్యూనర్ కారుకు మంచి డిమాండ్ ఉంది​. దీనిని బహుశా 2024 నవంబర్​లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిలో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్​ను ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం.

టయోటా ఫార్చ్యూనర్​

6. Tata Harrier Petrol
టాటా మోటార్స్ ఇటీవలే హారియర్ ఫేస్​లిఫ్ట్​ను లాంఛ్ చేసింది. కానీ పెట్రోల్ ఇంజిన్​ వేరియంట్​ను మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే 2024 ఏప్రిల్​లో టాటా హారియర్ పెట్రోల్ వేరియంట్​ను లాంఛ్ చేస్తామని కంపెనీ వెల్లడించింది. టాటా హారియర్​లో 1.5 లీటర్​ tGDi పెట్రోల్ ఇంజిన్​ను పొందుపరుస్తున్నారు.

టాటా హారియర్ పెట్రోల్​

7. Tata Safari Petrol
టాటా మోటార్స్ కంపెనీ.. హారియర్​తో పాటు సఫారీ పెట్రోల్ వేరియంట్​ను కూడా 2024 ఏప్రిల్​లో విడుదల చేయనుంది. దీనిలో కూడా1.5 లీటర్​ tGDi పెట్రోల్ ఇంజిన్​ను పొందుపరుస్తున్నారు. ఈ ఇంజిన్​ 168 bhp పవర్​, 280 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అలాగే ఇది 6 స్పీడ్​ మాన్యువల్​, 7 స్పీడ్​ డీసీటీ గేర్​ బాక్స్ అనుసంధానంతో వస్తుంది. టాటా సఫారీ కారులో 2.0 లీటర్​ టర్బో డీజిల్​ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

టాటా సఫారీ

8. Tata Curvv EV
టాటా కంపెనీ ఈ న్యూ జనరేషన్​ 2 ఎలక్ట్రిక్​ కారును 2024 నవంబర్​లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ టాటా కర్వ్​ ఈవీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 400-500 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

టాటా కర్వ్​ ఈవీ

9. Tata Harrier EV
2023 ఆటో ఎక్స్​పోలో ఈ టాటా హారియర్ ఈవీని పరిచయం చేశారు. దీనిని ICE వేరియంట్ కంటే భిన్నమైన డిజైన్​తో రూపొందించడం జరిగింది. ఈ కారులో డ్యూయెల్ మోటార్​ ఏడబ్ల్యూడీ సెటప్​ ఉంటుంది. బహుశా ఈ టాటా హారియర్ ఈవీ కారును 2024 మార్చిలో లాంఛ్ చేయవచ్చు.

టాటా హారియర్ ఈవీ

10. Tata Punch EV
టాటా మోటార్స్​ ఇండియన్ మార్కెట్​లో విడుదల చేస్తున్న నాల్లో ఈవీ కారు ఇది. దీనిలో 30kWh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 300 కి.మీ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. బహుశా ఈ టాటా పంచ్ ఈవీని 2024 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

టాటా పంచ్ ఈవీ

11. Honda Sub 4 Meter SUV
హోండా కంపెనీ 2030లో 5 సరికొత్త ఎస్​యూవీలను లాంఛ్ చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా 2024 సెప్టెంబర్​లో హోండా సబ్​ 4 మీటర్ ఎస్​యూవీని ఇండియన్​ మార్కెట్​లో లాంఛ్ చేయనుంది. ఈ కారు దాదాపు 4 మీటర్ల పొడవుతో, ఎలివేట్ డిజైన్​తో, ADAS టెక్​తో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

12. New Gen Honda Amaze
ఈ కాంపాక్ట్ సెడాన్​ 2024 ఏప్రిల్​లో ఇండియన్ మార్కెట్​లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో 1.2 లీటర్​ i-VTEC ఇంజిన్ అమర్చారు. ఇది 90 bhp పవర్​, 110 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ న్యూ జెన్ హోండా అమేజ్​ కారు ADAS టెక్​తో రానుంది.

హోండా అమేజ్​

13. Mahindra Thar 5 Door
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా 2024 ఆగస్టులో థార్​ 5 డోర్ కారును భారత మార్కెట్​లో లాంఛ్ చేయనుంది. స్కార్పియో ఎన్​ మోడల్​లోని ఇంజిన్​నే దీనిలోనూ పొందుపరిచారు. ఈ థార్ కారు 2.2 లీటర్​ mHawk డీజిల్​, 2.0 లీటర్​ mStallion పెట్రోల్​ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో 5 డోర్లు ఉంటాయి. పైగా విశాలమైన బుట్ స్పేస్ కూడా ఇందులో ఉంటుంది.

మహీంద్రా థార్

14. Mahindra XUV300 Facelift
మహీంద్రా ఎక్స్​యూవీ 300 ఫేస్​లిఫ్ట్​ను 2024 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నయా కారులోని క్యాబిన్​, డ్యాష్​బోర్డ్ లేఅవుట్​, ఇన్ఫోటైన్​మెంట్​ డిస్​ప్లేలను సరికొత్త డిజైన్​తో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

మహీంద్రా ఎక్స్​యూవీ300 ఫేస్​లిఫ్ట్​

15. New Mahindra XUV 500
మహీంద్రా కంపెనీ ఈ న్యూ మిడ్​ సైజ్​ ఎస్​యూవీ500ని 2024 సెప్టెంబర్​లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి దీనిని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్​, మారుతి సుజుకి గ్రాండ్​ విటారాలకు పోటీగా తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ కారు సుమారుగా 4.3 మీటర్ల పొడవు ఉంటుందని తెలియవస్తోంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 500

16. Kia Sonet Facelift
కియా సోనెట్ ఫేస్​లిఫ్ట్ 2024 ఫిబ్రవరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే పలు అంతర్జాతీయ పోర్టల్స్​లో దీని ఫొటోలు లీక్​ అయ్యాయి. వాస్తవానికి ఈ కారు ఎక్స్​టీరియర్, ఇంటీరియర్స్​లో పలు మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్

17. Kia EV9
ఈ ఫ్లాగ్​షిప్​ కియా ఎలక్ట్రిక్ ఎస్​యూవీ 2023 జూన్​లో లాంఛ్ కానుంది. ఇది మల్టిపుల్​ పవర్​ట్రైన్ ఆప్షన్స్​తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 99.8kWh బ్యాటరీ ఉంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 541 కి.మీ ప్రయాణించవచ్చుని కంపెనీ చెబుతోంది.

కియా ఈవీ 9

18. New Gen Kia Carnival (KA4)
ఈ కియా కార్నివాల్​ 4 ఎంవీపీ కారును 2024 జులైలో ఇండియన్​ మార్కెట్​లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారులో 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్​ ఉంది. ఇది 200 bhp పవర్​, 440 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

కియా కార్నివాల్​

19. Hyundai Creta Facelift
మోస్ట్ వెయిటెడ్ హ్యుందాయ్ క్రెటా ఫేస్​లిఫ్ట్​ను 2024 ఫిబ్రవరిలో లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిలో 1.5 లీటర్​ tGDi ఇంజిన్ అమర్చారు. ఇది 160 bhp పవర్​, 253 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా

20. Hyundai Alcazer Facelift
వాస్తవానికి హ్యుందాయ్​ అల్కాజర్​ను 2021లో లాంఛ్ చేయడం జరిగింది. అయితే దానిలో కొన్ని మిడ్​-లైఫ్ అప్​డేట్స్ చేస్తున్నారు. బహుశా ఈ అప్​డేటెడ్ అల్కాజర్ ఫేస్​లిఫ్ట్​​ను 2024 మార్చిలో విడుదల చేయవచ్చు.

హ్యుందాయ్ అల్కాజర్​

21. Hyundai Exter EV
కొరియన్​ కార్​ మేకర్​ హ్యుందాయ్ ఈ ఏడాది జులైలో ఎక్స్​టర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లను లాంఛ్ చేసింది. వీటితో పాటు తమ ఎలక్ట్రిక్ వేరియంట్లను కూడా భారత్​లో ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేసింది. అందులో భాగంగానే 2024 నవంబర్​లో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఈవీ మోడల్​ను భారత్​లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్ ఈవీలో 25-30kWh బ్యాటరీ ఉంటుందని.. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 300-350 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

22. Volkswagen ID 4 EV
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోక్స్​వ్యాగన్.. భారత్​లో ID 4 EVని లాంఛ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కారులోని బ్యాటరీని ఫుల్​ ఛార్జ్ చేస్తే ఏకంగా 480కి.మీ ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఈ ప్రీమియం కారు ధర రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. బహుశా దీనిని 2024 ఏప్రిల్​లో విడుదల చేసే అవకాశం ఉంది.

వోక్స్​వ్యాగన్​ ఐడీ 4 ఈవీ

23. New Volkswagen Tiguan
వ్యోక్స్​వ్యాగన్​ కంపెనీ ఈ టిగువాన్ కారును 2024 ఏప్రిల్​లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఇది మైల్డ్ హైబ్రీడ్​ పెట్రోల్, టర్బో డీజిల్ వేరియంట్స్​లో కూడా లభిస్తుంది.

వోక్స్​వ్యాగన్ టిగువాన్​

24. New Gen Skoda Kodiaq
ఈ న్యూ జనరేషన్​ స్కోడా కొడియాక్​ను 2024 ఏప్రిల్​లో ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎస్​యూవీ ధర రూ.40 లక్షల వరకు ఉంటుంది.

స్కోడా కొడియాక్

Google Pay Sachet Loan : చిరువ్యాపారులకు గుడ్ న్యూస్​.. ఈజీగా రూ.15,000 వరకు లోన్​.. ఈఎంఐ నెలకు రూ.111 మాత్రమే!

Electric Scooters Offers October 2023 : దసరాకు స్కూటర్​ కొనాలా?.. ఆ ఎలక్ట్రిక్ వెహికల్​పై ఏకంగా రూ.40,000 వరకు డిస్కౌంట్​!

ABOUT THE AUTHOR

...view details