Upcoming Bikes In India 2023 : భారత్‌లో టాప్ బ్రాండ్ బైక్స్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. దీనిని క్యాష్ చేసుకుంటూ బ్రాండెడ్ టూ-వీలర్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తెస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ ఏడాది కూడా రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్, హోండా, హోరో మోటోకార్ప్ లాంటి టాప్ కంపెనీలు.. సరికొత్త మోడల్స్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350
New Gen Royal Enfield Bullet 350 : యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న టూ-వీలర్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్. ప్రస్తుతం ఈ కంపెనీ ఆగస్టు నెలాఖరు నాటికి బుల్లెట్ 350ని భారత్ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీనిలో 349 సీసీ సింగిల్ సిలెండర్ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇది 20బీహెచ్పీ పవర్, 27 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ సూపర్ బైక్‌లో 5 స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది. ఈ బుల్లెట్ 350 బైక్.. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన హంటర్ 350, క్లాసిక్ 350 లైన్అప్లో ఉంది.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450
Royal Enfield Himalayan 450 : బైక్ ప్రియులందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న హిమాలయన్ 450 బైక్‌ను పండగ సీజన్లో లాంఛ్ చేసేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ సన్నాహాలు చేస్తోంది. ఈ బైక్‌లో 450 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను పొందుపరుస్తున్నారు. ఇది 40 బీహెచ్పీ పవర్, 45 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుందని తెలుస్తోంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310
TVS Apache RTR 310 : టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ నేకెడ్ స్పోర్ట్స్ వెర్షన్ బైక్‌ను 'అపాచీ ఆర్టీఎక్స్' ట్రేడ్‌మార్క్‌తో భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బైక్‌లో 312సీసీ ఇంజిన్ ఉంది. ఇది 34బీహెచ్పీ పవర్, 27.3 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇటీవల ఈ బైక్ రియర్ సెక్షన్ లీక్ అయ్యింది. ఇది ఆర్ఆర్ 310 బైక్ కంటే చాలా భిన్నంగా ఉండడం విశేషం. పండగ సీజన్లో దీనిని లాంఛ్ చేసేందుకు టీవీఎస్ మోటార్స్ కంపెనీ సిద్ధమవుతోంది.
హోండా సీబీ350 క్రూయిజర్
Honda CB350 Cruiser : హోండా కంపెనీ సీబీ350 ప్లాట్‌ఫాం ఆధారంగా సరికొత్త క్రూయిజర్ మోటర్‌సైకిల్ తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ జపాన్ కంపెనీ ఈ టూ-వీలర్ ద్వారా తన 350 సీసీ పోర్టుఫోలియోను భారత్‌లో మరింత విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రధానంగా రాయల్ ఎన్ఫీల్డ్ మెటోర్ 350కి పోటీగా.. హోండా సీబీ350 క్రూయిజర్‌ను తీసుకొస్తోంది.
హోండా సీబీ350 క్రూయిజర్ బైక్‌లో 348సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 21బీహెచ్పీ పవర్, 30ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 2023 చివరి నాటికి దీనిని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.
రాయల్ ఎన్ఫీల్డ్ బాబర్ 350
Royal Enfield Bobber 350 : క్లాసిక్ 350 ఆధారంగా రూపొందించిన బాబర్ 350 డిజైన్ చాలా యూనిక్‌గా ఉంది. ఇటీవల లీక్ అయిన దృశ్యాలు దీనిని ధ్రువీకరిస్తున్నాయి. దీనిలో సరికొత్త ఏప్ హ్యాంగర్ టైప్ హ్యాండిల్ బార్, రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ డిజైన్ ప్యూయల్ ట్యాంక్, డ్యూయెల్ స్ల్పిట్ ఫ్లోటింగ్ సీట్, నంబర్ ప్లేట్‌తో కూడిన టైర్ హగ్గర్ ఉన్నాయి.