Upcoming Bajaj Two Wheelers In India :భారతదేశంలోని అతిపెద్ద టూ-వీలర్ కంపెనీ బజాజ్ ఆటో 6 సరికొత్త బైక్‌లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా ఇండియన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనేందుకు వ్యూహం రచిస్తోంది.
బజాజ్ ఆటో కంపెనీ.. తమ లేటెస్ట్ పల్సర్ NS400, న్యూ సీఎన్జీ బైక్, పల్సర్ 125, సన్నీ ఈవీ, CT 150X, చేతక్ ఈవీ న్యూ వేరియంట్ బైక్‌లను వచ్చే ఏడాది నుంచి క్రమంగా లాంఛ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అందుకే వాటిపై మనమూ ఓ లుక్కేద్దాం.
1. Bajaj Pulsar NS400 Features :బజాజ్ కంపెనీ ఈ సూపర్ పవర్ఫుల్ పల్సర్ ఎన్ఎస్400 బైక్‌ను 2024లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. డోమినార్400 బైక్‌లో ఉపయోగించిన 373 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్నే ఈ బైక్‌లోనూ అమర్చారు. ఇది 40 bhp పవర్, 35 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. పల్సర్ NS200 డిజైన్ ఇన్స్పిరేషన్తో, సరికొత్త షార్ప్ స్టైలింగ్ లుక్‌తో ఈ పల్సర్ NS400 బైక్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
2. Bajaj CNG Bike Features :బజాజ్ కంపెనీ ఈ సీఎన్జీ బైక్‌ను Bruzer E101 అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తోంది. ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ ఈ సరికొత్త బైక్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బైక్‌ను CT100 లేదా CT110 బైక్ డిజైన్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా సీఎన్జీ కార్లలో బై-ఫ్యూయెల్ సెటప్ ఉంటుంది. అయితే బజాజ్ కంపెనీ తమ CNG బైక్‌లో.. బై-ఫ్యూయెల్ ట్యాంక్‌ను అమర్చడం లేదు. కానీ ఈ బైక్‌లో కచ్చితంగా పెట్రోల్ ట్యాంక్‌ను కూడా అమర్చే అవకాశం ఉంది. ఎందుకంటే, వాహనదారులు సమీపంలోని CNG స్టేషన్ల వరకు వెళ్లడానికైనా పెట్రోల్ ట్యాంక్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. బైక్ ఖర్చులు వీలైనంత వరకు తగ్గించాలని భావించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.