Ujjwala Yojana Free Gas Cylinder :దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన- పీఎమ్‌యూవై రెండో దశ కింద మరో 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. 2026 వరకు కొనసాగే రెండో దశ ఉజ్వల యోజన పథకం కోసం 1650 కోట్లను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఉజ్వల 2.0లో భాగంగా లబ్ధిదారులకు మొదటి రీఫిల్, స్టవ్‌ను ఉచితంగా అందజేస్తామని మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం పీఎమ్యూవైలో భాగంగా 14.2 కిలోల సిలిండర్‌పై ఏడాదికి 12 రీఫిళ్ల వరకు రూ.200 చొప్పున సబ్సిడీ (Ujjwala Yojana Subsidy Amount) అందిస్తున్నారు. ఈ కొత్త కనెక్షన్లతో.. ఉజ్వల పథకం కింద మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుంది. అయితే దేశంలో చాలా మందికి ఇంకా ఎల్పీజీ కనెక్షన్ లేదని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే జానాభా పెరుగుతుండటం, వివాహాలు, వలసలు వంటి కారణాల వల్ల కొత్త కుటుంబాలు ఏర్పడుతున్నాయి. 2023 ఆగస్టు 31 నాటికి దేశంలో దాదాపు 15 లక్షల పీఎమ్‌యూవై కనెక్షన్ల కోసం డిమాండ్ ఏర్పడింది.