mAadhaar App Benefits :ప్రస్తుతం దేశంలో ఎలాంటి సంక్షేమ పథకాలు పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్, ఓటర్ ఐడీ, సిమ్ కార్డు.. ఇలా ఏది తీసుకోవాలనుకున్నా.. ప్రతి పనికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇంతటి విలువైన ఆధార్(Aadhaar) దుర్వినియోగం కాకుండా ఉండేందుకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI).. mAadhaar అనే మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. అయితే.. చాలా మందికి ఈ యాప్ గురించి తెలియదు. మనకు ఒక్కోసారి ఆధార్ నంబర్ వివరాలు అత్యవసరం అవుతాయి. ఆ టైమ్‌లో ఇది చాలా యూజ్ అవుతుంది. ఇదొక్కటే కాదు ఈ యాప్‌తో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకీ mAadhaar యాప్‌లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేయాలి? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
UIDAI ప్రకారం.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు తమ ఆధార్‌ను లింక్ చేసిన వ్యక్తులు మాత్రమే దీనిని యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత.. అందులో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి అవసరమయ్యే ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఆండ్రాయిడ్, iOS ఫోన్లలోనూ ఈ యాప్‌ను పొందవచ్చు.
mAadhaar యాప్‌లో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోండిలా..
- ముందుగా మీరు ఫోన్లో mAadhaar యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత దానిని ఓపెన్ చేసి ఎగువన 'రిజిస్టర్ ఆధార్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయడానికి 4 అంకెల పాస్‌వర్డ్‌ను క్రియెట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీని అందుకుంటారు.
- OTP అక్కడ నమోదు చేసి Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ ప్రక్రియ విజయవంతం అవుతుంది. మీ ప్రొఫైల్ రిజిస్టర్ అవుతుంది.
- చివరగా.. దిగువ మెనూలో 'My Aadhaar' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి నావిగేట్ అవ్వాలి.
- అంతే.. మీ ఆధార్ నంబర్ యాప్‌తో లింక్ అవుతుంది. తర్వాత ఫోన్లోకి మీ ఆధార్ కార్డు వచ్చేస్తుంది.