Types Of Credit Cards In India : బ్యాంకులు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల క్రెడిట్ కార్డులను డిజైన్ చేస్తుంటాయి. వాటిలో మన అవసరాలకు తగిన కార్డును ఎంచుకోవాలి. అప్పుడే మన అవసరాలు తీరుతాయి. అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ప్రస్తుతానికి వినియోగదారుల సౌలభ్యం కోసం ఇండియన్ బ్యాంకులు 8 రకాల క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వాటి గురించి, వాటి ఫీచర్స్, బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. సాధారణ క్రెడిట్ కార్డులు
Regular Credit Card Benefits :మనలో చాలా మంది సాధారణ క్రెడిట్ కార్డులనే ఉపయోగిస్తారు. ఈ కార్డుకు అనుబంధంగా కుటుంబ సభ్యుల కోసం 3 యాడ్-ఆన్ కార్డులు కూడా తీసుకోవచ్చు. సాధారణ అవసరాలతోపాటు ఇంధన సర్ఛార్జ్ మినహాయింపులు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డు పాయింట్లు లాంటి అదనపు బెనిఫిట్స్ ఈ కార్డుల ద్వారా పొందవచ్చు.
2. సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డు
Super Premium Credit Card Benefits : సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డులతో ఫ్యాన్సీ లాంజ్ యాక్సెస్, ఫ్రీ గోల్ఫ్ గేమ్స్, రివార్డ్స్ పాయింట్స్ సహా, రెస్టారెంట్లలో చేసే ఖర్చులపై మంచి డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇవే కాకుండా చాలా అదనపు ప్రయోజనాలను కూడా కల్పిస్తాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అయినప్పుడు సూపర్ ప్రీమియం కార్డు బాగా ఉపయోగపడుతుంది.
3. కో బ్రాండెడ్ కార్డులు
Co Branded Card Benefits : క్రో బ్రాండెడ్ కార్డులు కొన్ని రకాల ప్రత్యేక సేవలను అందిస్తాయి. ఉదాహరణకు విమాన ప్రయాణాలకు సంబంధించిన బ్రాండెడ్ కార్డు తీసుకుంటే.. మనం చేసే ప్రయాణాలపై అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. విమాన టికెట్ ధరల తగ్గింపు, ప్రత్యేక చెక్ ఇన్ కౌంటర్లు, అదనపు లగేజీ ఛార్జీలు తగ్గింపు, ఫ్రీ లాంజ్ యాక్సెస్ లభిస్తాయి. అంతేకాదు మీరు ఫ్రీ ఎయిర్‌మైల్స్ సంపాదించి, వాటితో ఉచితంగా విమానం టికెట్లను కూడా పొందవచ్చు.
4. కమర్షియల్ క్రెడిట్ కార్డులు
Commercial Or Business Card Benefits : కమర్షియల్ క్రెడిట్ కార్డులు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడతాయి. బిజినెస్ ట్రిప్స్, పర్చేజెస్ అన్నింటిపై బెనిఫిట్స్ పొందవచ్చు. అంతేకాకుండా ప్రణాళిక ప్రకారం మన ఖర్చులను, ఇతర వ్యయాలను తెలుసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు చేసింది. ఏ వస్తువుపై ఎంత ఖర్చయిందీ ఈ కార్డు ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. బ్యాంకులు పెద్ద కంపెనీల కోసం కార్డొరేట్ కార్డులు 24/7 సేవలు అందిస్తున్నాయి.