తెలంగాణ

telangana

ETV Bharat / business

'8 డాలర్లకే బ్లూటిక్​' సేవలు ప్రారంభం .. త్వరలోనే భారత్​లో సైతం..! - twitter blue tick in ios

ట్విట్టర్​ను హస్తగతం చేసుకున్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్​.. అభివృద్ధి పనుల్లో భాగంగా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్​ సబ్​స్క్రిప్షన్​ను 7.99 డాలర్లకు అందించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

twitter blue tick
twitter blue tick

By

Published : Nov 6, 2022, 12:19 PM IST

ట్విట్టర్​ సబ్​స్క్రిప్షన్​ను 7.99 డాలర్లకు అందించనున్నట్లు ట్విట్టర్​ సీఈఓ ఎలన్​ మస్క్​ శుక్రవారం ప్రకటించారు. ఈ క్రమంలో చందాదారులు రుసుము చెల్లించి బ్లూ టిక్​ సేవలను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బ్లూ టిక్‌ ప్రీమియం సేవలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అమెరికాలోని ఐ-ఫోన్లలో మాత్రమే అమల్లో ఉన్నాయి. త్వరలో మరికొన్ని ప్రాంతాల్లో అమలుచేయనున్నట్లు పేర్కొన్న ట్విట్టర్ అధినేత ఇందుకోసం నెలకు 8 డాలర్లు ఛార్జ్‌ చేయనున్నట్లు తెలిపారు. అయితే యూఎస్​ మధ్యంతర ఎన్నికల తరుణంలో ఇలాంటి కీలక ప్రకటనలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా బ్లూ టిక్‌ను పొందగలిగితే అవి మధ్యంతర ఎన్నికలకు ముందు గందరగోళానికి దారి తీసే ప్రమాదం ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాపించే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.

ఐ-ఫోన్‌ ట్విట్టర్​ యాప్‌ అప్‌డేట్‌లో ఓ నోటిఫికేషన్ ఉంచిన ఆ సంస్థ యాజమాన్యం ఆదివారం నుంచి ట్విట్టర్​ బ్లూటిక్​కు కొత్త ఫీచర్లను జోడిస్తున్నామని తెలిపంది. త్వరలోనే మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. ఇప్పుడే సైన్ అప్ చేస్తే నెలకు 7.99 డాలర్లకు పొందవచ్చని తెలిపింది. సెలబ్రిటీలు, కంపెనీలు, రాజకీయనేతల మాదిరిగా సామాన్యులు నగదు చెల్లించి బ్లూటిక్‌ మార్క్‌ పొందవచ్చని ట్విట్టర్​ పేర్కొంది.

భారత్​లోనూ బ్లూటిక్ సేవలు..
భారత్‌లోనూ ట్విట్టర్ బ్లూటిక్‌ ప్రీమియం సేవలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. నెల కంటే తక్కువ రోజుల్లోనే ఈ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు ట్విట్టర్ కొత్త బాస్‌ ఎలాన్​ మస్క్‌ స్పష్టత ఇచ్చారు. ట్విట్టర్ బ్లూటిక్‌ ప్రీమియం సేవలు భారత్‌లోనూ ప్రారంభిస్తారా అని ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు ఆ మేరకు సమాధానం ఇచ్చారు.

ఇదీ చదవండి:ట్విట్టర్​లో ఉద్యోగాల కోత మొదలు.. వారందరికీ మెయిల్స్.. ఆఫీసులు బంద్

కరెన్సీకి ఇక కాలం చెల్లినట్టేనా.. డబ్బు ఇక కనిపించదా!

ABOUT THE AUTHOR

...view details