Twitter spam accounts: స్పామ్ అకౌంట్లపై ట్విట్టర్ ఎలాంటి చర్యలు చేపట్టట్లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం కీలక వ్యాఖ్యలు చేసింది. తాము రోజుకు 10 లక్షల నకిలీ ఖాతాలను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఎగ్జిక్యూటివ్‌లతో గురువారం జరిగిన సమావేశంలో ఈ విధంగా పేర్కొంది. నకిలీ ఖాతాలపై ట్విట్టర్ ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ దిగ్గజ వ్యాపార వేత్త ఎలాన్ మస్క్ ఆరోపణల నేపథ్యంలో ట్విట్టర్ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
'రోజుకు 10 లక్షల స్పామ్ అకౌంట్లు తొలగిస్తున్నాం'
Twitter spam accounts: నకిలీ ఖాతాల తొలగింపుపై ట్విట్టర్ కీలక వ్యాఖ్యలు చేసింది. రోజుకు 10 లక్షల స్పామ్ అకౌంట్లను తొలగిస్తున్నట్లు మైక్రో బ్లాగింగ్ సంస్థ వెల్లడించింది. రోజువారీ యాక్టివ్ యూజర్లలో స్పామ్ అకౌంట్ల సంఖ్య 5 శాతం కన్నా తక్కువే ఉంటోందని స్పష్టం చేసింది.
కొన్ని వారాల క్రితం 44 బిలియన్ డాలర్లకు సంస్థను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన మస్క్.. ట్విట్టర్‌లోని నకిలీ ఖాతాలపై నియంత్రణ లేదన్నారు. రోజువారీ యాక్టివ్ యూజర్లలో స్పామ్ అకౌంట్ల సంఖ్య 5 శాతం కన్నా తక్కువ ఉంటేనే కొనుగోలుకు అంగీకరిస్తానని మస్క్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ట్విట్టర్ స్పామ్ అకౌంట్ల సంఖ్య 5 శాతం కన్నా తక్కువే ఉందని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే మస్క్ సంస్థను కొనుగోలు చేయడంపై ట్విట్టర్ వాటాదార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఇదీ చూడండి :విదేశీ విద్యపై డాలర్ దెబ్బ.. భారీగా క్షీణించిన రూపాయి విలువ