Twitter server Down : సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ మరోసారి మొరాయించింది. ఆదివారం సాయంత్రం 6.55 గంటల నుంచి 8.15 వరకు ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు డౌన్ డిటెక్టర్‌లో ఫిర్యాదు కనిపించాయి. ఇటీవల కాలంలో ట్విట్టర్ తరచూ మొరాయిస్తోంది. సిబ్బంది కొరత, ఇతర సాంకేతిక కారణాల వల్ల ట్విట్టర్ సేవలు ఇలా నిలిచిపోతున్నాయని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మరోసారి ట్విట్టర్లో సమస్య కనిపించింది.
గంటకుపైగా నిలిచిపోయిన ట్విట్టర్ సేవలు.. జియో యూజర్లకేనా? - ఎలాస్ మస్క్ లేటెస్ట్ న్యూస్
Twitter server Down : ప్రముఖ సామాజిక దిగ్గజం ట్విట్టర్ మరోసారి మొరాయించింది. ఆదివారం సాయంత్రం 6.55 గంటల నుంచి 8.15 వరకు ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి.
![గంటకుపైగా నిలిచిపోయిన ట్విట్టర్ సేవలు.. జియో యూజర్లకేనా? Twitter server Down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17177584-thumbnail-3x2-twitter.jpg)
Nothing to see here, Something went wrong. Try reloading... గత కొన్ని రోజులుగా ట్విట్టర్లో అప్పుడప్పుడు ఇలాంటి మెసేజ్‌లు కనిపిస్తూ వస్తున్నాయి. వాటి అర్థం ట్విట్టర్ సేవలు యూజర్లకు అందుబాటులో లేవు అని. తాజాగా ఇవే మెసేజ్‌లు ఆదివారం కూడా కనిపించాయి. దీంతో యూజర్లు మరోమారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ బ్లూ టిక్ సేవలు మళ్లీ ప్రారంభించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇలా సాంకేతిక సమస్య రావడం గమనార్హం. తాజా సమస్యపై ట్విట్టర్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ సమస్య మన దేశంలో జియో నెట్‌వర్క్ వాడేవాళ్లకే వచ్చిందని సమాచారం.