Twitter New CEO : ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యాకరినో.. సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక నుంచి ట్విట్టర్ వ్యాపార కార్యకలాపాలను.. పూర్తిగా లిండా యాకరినో చూసుకోనున్నారు. ట్విట్టర్ నూతన సీఈఓగా నియమితురాలైన లిండా యాకరినో.. ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ విభాగం ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమెతో పాటు పనిచేసిన ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ వైస్ ప్రెజిడెంట్.. జో బెనారోచ్ కూడా తన టీంలో చేర్చుకున్నారు లిండా. జో బెనారోచ్.. లిండాకు ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. మరోవైపు ఎలాన్ మస్క్ ప్రొడక్ట్ డిజైన్, కొత్త సాంకేతికపై దృష్టి సారించనున్నారు. దాంతో పాటు టెస్లా, స్పేస్ ఎక్స్‌పై ఆయన పూర్తి స్థాయిలో పని చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
"నేను ఓ భిన్నమైన వృత్తి సాహాసాన్ని ప్రారంభించనున్నాను. ట్విట్టర్ వ్యాపార కార్యాకలపాలపై దృష్టి సారించేందుకు ఆ బాధ్యతలను తీసుకుంటున్నాను. నా అనుభవం మొత్తాన్ని ట్విట్టర్లో కేంద్రీకరించేందుకు ఎదురు చూస్తున్నాను. ట్విట్టర్ 2.0 నిర్మిచేందుకు.. టీం అందరితో కలిసి పని చేస్తాను." అని జో బెనారోచ్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం సీఈఓగా నియామకమైన అనంతరం.. లిండా యాకరినో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ 2.0ను నిర్మించేదుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎలాన్ మస్క్‌తో పాటు మిలియన్ల యూజర్లతో కలిసి ట్విట్టర్లో మార్పులు తెస్తానని ఆమె వెల్లడించారు.