తెలంగాణ

telangana

ETV Bharat / business

మస్క్​ మామ గుడ్​బై!.. ట్విట్టర్ కొత్త​ CEO 'ఆమె'నే!! - ట్విట్టర్​ లేటెస్​ అప్​డేట్​

Twitter New CEO : అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​.. ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్​కు కొత్త సీఈఓను ఎంపిక చేశానని.. 6 వారాల్లో నూతన సీఈఓ బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు.

twitter new ceo
twitter new ceo

By

Published : May 12, 2023, 6:59 AM IST

Updated : May 12, 2023, 7:38 AM IST

Twitter New CEO : ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌.. తన పదవి నుంచి వైదొలగనున్నారు. ట్విట్టర్‌కు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు మస్క్‌ ప్రకటించారు. ఆరు వారాల్లో ట్విట్టర్‌ నూతన CEO బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ట్విట్టర్​ నూతన CEOగా ఎంపికచేసిన మహిళ పేరును మాత్రం మస్క్​ వెల్లడించలేదు. ట్విట్టర్‌లో తాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతానని వివరించారు. ఉత్పత్తి, సాఫ్ట్‌వేర్‌, సిసోప్స్‌లను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు.

గతేడాది నవంబర్‌లోనే ట్విట్టర్‌లో తన సమయాన్ని కుదించుకుంటానని మస్క్‌ తెలిపారు. మస్క్‌ తాజా నిర్ణయంతో టెస్లా పెట్టుబడిదారుల ఆందోళన తగ్గింది. ఆ సమయాన్ని మస్క్‌.. టెస్లా కోసం కేటాయిస్తారని వారు ఆశిస్తున్నట్లు సమాచారం. ట్విటర్‌కు కొత్త సీఈఓ నిర్ణయం మస్క్‌ ప్రకటించగానే.. టెస్లా షేర్లు 2.4 శాతం పెరిగాయి. అంతకుముందు డిసెంబర్​లో ట్విట్టర్ సీఈఓగా కొనసాగాలా? లేక వైదొలగాలా? అని ప్రశ్నిస్తూ మస్క్‌ పోల్​ నిర్వహించారు. ఈ పోల్‌లో ఎక్కువ మంది యూజర్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. వారి నిర్ణయానికి అంగీకరించిన ఆయన ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన స్థానంలో వేరే వ్యక్తి వచ్చే వరకు ఆ స్థానంలో కొనసాగుతానని తెలిపారు.

వెరిఫైడ్ యూజర్లకు ముందుగానే ఎన్​క్రిప్ట్​ మసేజ్​ సర్వీస్
నూతన CEO విషయాన్ని ప్రకటించకముందే మరో కొత్త అప్​డేట్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు మస్క్​. ట్విట్టర్​ కొత్తగా తీసుకువస్తున్న ఎన్​క్రిప్టిడ్​ మెసేజింగ్​ సర్వీస్​ను వెరిఫైడ్ యూజర్లకు ముందుగానే అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు. కానీ దీనిని ఇప్పుడే పూర్తిగా నమ్మకండి అని ట్వీట్ చేశారు.

ట్విట్టర్​లో వాట్సాప్​ తరహా ఫీచర్స్​!
అంతకుముందు బుధవారం ట్విట్టర్​ కీలక ప్రకటన చేసింది. వాట్సాప్​లో ఉన్న వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లను త్వరలోనే ట్విట్టర్​లోనూ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్. "ట్విట్టర్​ లేటెస్ట్​ వెర్షన్​ యాప్​తో.. ట్వీట్ థ్రెడ్​లోని ఏదైనా మెసేజ్​కు మీరు డీఎం (డైరెక్ట్ మెసేజ్) చేయవచ్చు. ఎమోజీ రియాక్షన్స్ ఇవ్వొచ్చు. ఎన్​క్రిప్టెడ్ DMs V1.0 గురువారమే అందుబాటులోకి వస్తుంది. తర్వాత మరింత అప్డేట్ అవుతుంది. మీ డైరెక్ట్ మెసేజ్​లను నేను కూడా చూడలేనంతగా ఎన్​క్రిప్ట్ చేయడమే అసలు పరీక్ష. మీ ట్విట్టర్​ హ్యాండిల్​ నుంచి ఎవరితోనైనా వాయిస్, వీడియో చాట్ చేసే అవకాశం త్వరలోనే వస్తుంది. అదే జరిగితే.. మీ మొబైల్ నంబర్​ ఇవ్వకుండానే ఈ ప్రపంచంలో ఎవరితోనైనా మీరు మాట్లాడవచ్చు." అని బుధవారం ఓ ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్.

ఇవీ చదవండి :పిక్సెల్‌ 7ఏ, ఫోల్డ్‌, ట్యాబ్లెట్‌.. AIపై ప్రత్యేక దృష్టి.. గూగుల్‌ నయా అప్డేట్లు ఇవే!

వాట్సాప్​ వాడకపోయినా మన మాటలు రికార్డ్!.. ఆధారాలతో బట్టబయలు.. కేంద్రం సీరియస్!

Last Updated : May 12, 2023, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details