తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్​ బోర్డ్​లో చేరేందుకు మస్క్ నో- నిరాశ్రయుల శిబిరంగా సంస్థ హెడ్​క్వార్టర్స్​! - ఎలాన్ మస్క్ వార్తలు

Twitter Elon Musk: ట్విట్టర్​లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినా.. ఆ సంస్థ బోర్డ్​లో సభ్యునిగా చేరేందుకు నిరాకరించారు వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్. ట్విట్టర్​ సీఈఓ పరాగ్ అగర్వాల్​ ఈ విషయం వెల్లడించారు. మరోవైపు.. ట్విట్టర్​ ప్రధాన కార్యాలయాన్ని నిరాశ్రయుల శిబిరంగా మార్చాలా? అంటూ ఓ ఆన్​లైన్​ పోల్​ నిర్వహించారు మస్క్.

Twitter Board Musk Parag
Twitter Board Musk Parag

By

Published : Apr 11, 2022, 10:17 AM IST

Twitter Elon Musk: ట్విట్టర్​లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి, ఆ సామాజిక మాధ్యమంలో కీలక మార్పులు ఖాయమని సంకేతాలిచ్చిన వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్​లో 9.2శాతం వాటా కొనుగోలు చేసినా.. ఆ సంస్థ బోర్డ్​లో డైరెక్టర్​గా చేరేందుకు నిరాకరించారు. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

Twitter Board Musk Parag: "బోర్డ్​లో చేరడంపై నేను, ఇతర డైరెక్టర్లు మస్క్​తో చాలాసార్లు చర్చించాం. సంస్థ ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేయడం, ఇందులో ఉన్న రిస్క్​లు.. ఇలా అన్నింటిపైనా సమాలోచనలు జరిపాం. సంబంధిత ప్రక్రియలన్నీ పూర్తయ్యాక మస్క్​ బోర్డ్ సభ్యునిగా చేరతారని ఇటీవల ప్రకటించాం. అయితే.. బోర్డ్​లో చేరడం లేదని మస్క్​ నాకు చెప్పారు. ఇది కూడా మంచికే అనుకుంటున్నా. బోర్డ్​లో సభ్యునిగా ఉన్నా లేకపోయినా భాగస్వామ్యపక్షాల సలహాలు, సూచనలు మేము స్వీకరిస్తాం. మస్క్​ మన అతిపెద్ద వాటాదారు కాబట్టి ఆయన ఇన్​పుట్స్​కు ఎప్పుడూ విలువ ఉంటుంది. కొన్ని అవాంతరాలు ఎదురైనా.. మన లక్ష్యాలు, ప్రాథమ్యాలు మారవు. నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే అధికారం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి మన పనిపైనే దృష్టిపెడదాం" అని ట్విట్టర్​ ఉద్యోగులకు జారీ చేసిన నోట్​లో పేర్కొన్నారు పరాగ్.

ట్విట్టర్​ను మార్చేస్తారా?:ట్విట్టర్​లో చాలా యాక్టివ్​గా ఉండే మస్క్... ఆ సంస్థలో ఇటీవలే వాటాదారుగా మారారు. ఆ తర్వాత ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ట్విట్టర్​లో ఎడిట్​ బటన్​ తీసుకురావాలా అన్న ఆయన ప్రశ్నకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. మస్క్​ ఇప్పుడు ట్విట్టర్​లో భాగస్వామి కాబట్టి.. త్వరలో ఆ ఫీచర్ రావడం ఖాయమని అంతా భావించారు.

ఆదివారం మస్క్​ ఇదే తరహాలో మరో ట్వీట్ చేశారు. ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్​ హోమ్ చేస్తున్నందున.. ప్రస్తుతం అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో ఖాళీగా ఉన్న ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని నిరాశ్రయుల శిబిరంగా మార్చేయాలా అని పోల్ నిర్వహించారు. 19 లక్షల మందికిపైగా ఈ పోల్​కు స్పందించారు. 91శాతం మందికిపైగా అవును అని బదులిచ్చారు. మస్క్​ ప్రశ్నకు స్పందించిన వారిలో అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ కూడా ఉండడం గమనార్హం. ట్విట్టర్​ ఆఫీస్​లో కొంత భాగాన్ని హోంలెస్ షెల్టర్​గా మార్చాలని, మిగిలిన భాగాన్ని కార్యాలయానికి రావాలనుకునే ఉద్యోగుల కోసం వదిలేయాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:ట్విట్టర్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్స్​లో సభ్యుడిగా మస్క్​

ABOUT THE AUTHOR

...view details