తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ ఓకే.. డీల్ పునరుద్ధరణ కోసం సంస్థకు లేఖ - ట్విట్టర్ ఒప్పందం

ట్విట్టర్ కొనుగోలు విషయంలో గతంలో వెనక్కి తగ్గిన ఎలాన్ మస్క్.. తాజాగా మనసు మార్చుకున్నారు. డీల్​ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్​కు లేఖ రాశారు.

twitter-deal-musk
twitter-deal-musk

By

Published : Oct 4, 2022, 10:22 PM IST

Updated : Oct 4, 2022, 10:42 PM IST

ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ట్విట్టర్​ డీల్​పై ముందుకే వెళ్లాలని ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డీల్ విషయంపై ట్విట్టర్, మస్క్ మధ్య న్యాయపోరాటం జరుగుతోంది. ఈ సమయంలోనే కొనుగోలుపై మస్క్ తాజా నిర్ణయం తీసుకున్నారని బ్లూమ్​బర్గ్ కథనం వెల్లడించింది. 44 బిలియన్ డాలర్లు చెల్లించి ట్విట్టర్​ డీల్​ను కొనసాగించనున్నారని తెలిపింది. ఈ మేరకు డీల్ పూర్తి చేసేందుకు ట్విట్టర్ సంస్థకు మస్క్ లేఖ రాశారని బ్లూమ్​బర్గ్ పేర్కొంది.

ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున చెల్లిస్తానని మస్క్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) 12 గంటల తర్వాత ట్విట్టర్ షేరు దూసుకెళ్లింది. సుమారు 13శాతం లాభపడి 47.95 డాలర్ల వద్దకు చేరుకుంది. దీంతో షేరు ట్రేడింగ్​ను నిలిపివేశారు.

ట్విట్టర్‌ కొనుగోలుకు గతంలో ప్రయత్నించిన ఎలాన్‌ మస్క్‌.. కొన్ని కారణాలు చెబుతూ ఆ డీల్‌ను రద్దు చేసుకున్నాడు. ఆ డీల్‌ను ప్రతిపాదించిన నాటి నుంచే ట్విట్టర్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ట్విటర్‌లో దాదాపు 20శాతం ఖాతాలు నకిలీవేనంటూ చెబుతున్నారు. బాట్/స్పామ్ ఖాతాల లెక్క తేలనిదే ఒప్పందంపై ముందుకు వెళ్లనని ఇదివరకు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒప్పందం నుంచి వైదులుగుతూ సంచలన ప్రకటన చేశారు. దీంతో మస్క్​పై న్యాయపోరాటానికి దిగింది ట్విట్టర్ సంస్థ. అక్టోబర్ చివర్లో దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

Last Updated : Oct 4, 2022, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details