Twitter Data Breach : ఎలాన్ మస్క్ నేతృత్వంలో ట్విట్టర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 40 కోట్ల మంది ట్విట్టర్ వినియోగదారుల డేటాను దొంగిలించి డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు హ్యాకర్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెలీ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ హడ్సన్ రాక్ వెల్లడించింది. ఇందులో ప్రముఖల ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లు సైతం ఉన్నాయని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెరికన్ సింగర్ చార్లీ పుత్ తదితరుల సమాచారం చోరీకి గురైందని హడ్సక్ రాక్ సంస్థ పేర్కొంది. అలాగే హ్యాకర్ షేర్ చేసిన చిత్రాలను పోస్ట్ చేసింది.
"నేను 40 కోట్ల మంది ట్విట్టర్ వినియోగదారుల డేటాను విక్రయిస్తున్నాను. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నేను పెట్టిన ఈ పోస్ట్‌ను చదువుతున్నట్లయితే ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలి. ఈ డేటాను కొనేందుకు ముందుకు రావాలి. ఇప్పటికే ట్విట్టర్‌కు 54 లక్షల మంది డేటా లీక్ వల్ల జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్) చట్టం ప్రకారం భారీ జరిమానా పడే అవకాశం ఉంది. మళ్లీ 40 కోట్ల మంది డేటా లీక్ వల్ల 2.77 మిలియన్ డాలర్ల జరిమానా పడుతుంది. ఫేస్బుక్ అంతకుముందు ఈ చట్టం ఉల్లంఘన వల్ల జరిమానా చెల్లించింది. అలా కాకుండా మీరే 40 కోట్ల మంది డేటాను కొనుగోలు చేయండి. ఇంకెవరికీ ట్విట్టర్ డేటాను విక్రయించను."
--హ్యాకర్