TVS X Electric Scooter Launch : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ కంపెనీ మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంఛ్ చేసింది. 'టీవీఎస్ Xonic'( TVS Xonic Electric Scooter )పేరుతో ఆగస్టు 23(బుధవారం) రాత్రి ఈ ప్రీమియం ఈ-స్కూటర్‌ను భారత విపణిలోకి అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక హంగులతో టీవీఎస్ లాంఛ్ చేసిన ఈ ఈవీ ప్రారంభ ధరను అక్షరాల రూ.2,49,900(బెంగళూరు ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. దాదాపు రెండున్నర లక్షలు ప్రైజ్ ట్యాగ్‌తో వచ్చిన ఈ స్కూటర్లో ధరకు తగ్గట్లే ఫీచర్స్‌ను కూడా ఇన్‌బిల్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర సంస్థల ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇది కచ్చితంగా పోటీ ఇవ్వనుందని బైక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఫీచర్లు- స్పీడ్- రేంజ్..!
TVS X Electric Features : టీవీఎస్ తీసుకువచ్చిన ఈ నయా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎక్కువగా స్పీడోమీటర్‌పై ఫోకస్ చేశారు. దీంతో ఇది గంటకు 140 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే దీని రేంజ్ 63 కి.మీ వరకు ఉంటుందని తెలిపింది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు నేవిగేషన్ సిస్టం, ఈవీ( TVS E Scooter )ఛార్జర్ మ్యాపింగ్ మెకానిజమ్, లైవ్ వెహికల్ లొకేషన్ షేరింగ్ వంటి స్టన్నింగ్ ఫీచర్స్ ఈ బైక్‌లోని ప్రత్యేకతలని పేర్కొంది.
ఎక్స్ట్రా ఫీచర్స్..
- 3.8 kWh బ్యాటరీ.
- స్టెల్త్, ఎక్స్‌ట్రైడ్, ఎక్సోనిక్ మోడ్స్.
- 2.6 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
- ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
- గరిష్ఠంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేయొచ్చు.
- ఇక స్కూటర్ భద్రత కోసం నెక్ట్స్-జెనరేషన్ ABSను కూడా ఇచ్చారు.
- 3 kW ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే కేవలం గంట వ్యవధిలో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.