TVS Apache RTR 310 : దేశీయ ద్విచక్ర వాహన కంపెనీ తయారీదారు టీవీఎస్ మోటార్స్ మరో కొత్త మోడల్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. తన విజయవంతమైన మోడల్ అపాచీ సిరీస్‌లో భాగంగా కొత్త అపాచీ 'TVS Apache RTR 310'ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 6(బుధవారం)న దీనిని లాంఛ్ చేశారు. కాగా, టీవీఎస్ అపాచీ సిరీస్‌లోని RR 310 మోడల్‌కు మరిన్ని హంగులు అద్ది అప్డేటెడ్ వెర్షన్‌గా RTR 310 మోడల్‌ను రిలీజ్ చేశారు.
స్పెక్స్ అండ్ ఫీచర్స్!
TVS Apache RTR 310 Specifications : డిజిటల్ ఇన్‌స్ట్రూమెంటల్ ప్యానెల్, అలాయ్ వీల్స్ సహా ఇతర అధునాతన ఫీచర్స్‌ను RTR 310లో గమనించవచ్చు. ఇక బ్రేక్‌ల విషయానికొస్తే.. డ్యూయెల్ ఛానల్ ABSతో సింగిల్ ఫ్రంట్ డిస్క్, సింగిల్ రియర్ డిస్క్ బ్రేక్‌లను ఇందులోని ముందు, రియర్ వీల్స్‌లో వాడారు. ఈ టైర్ల పరిమాణం 17 అంగుళాలుగా ఉంది. అపాచీ RR 310లోని ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ సహా ఇతర ఫీచర్స్‌ను TVS Apache RTR 310లోనూ గమనించవచ్చు. వీటికి అదనంగా అడ్వాన్స్డ్ ఫీచర్స్‌ను తాజాగా లాంఛ్ చేసిన మోడల్లో వినియోగించారు. నేక్డ్ వెర్షన్‌గా కనిపిస్తున్న ఈ బైక్‌లో 313cc, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఫిక్స్ చేశారు. ఇక దీని ధరను రూ.2.43(ఎక్స్-షోరూమ్) లక్షలుగా( TVS Apache RTR 310 Price ) ఉంది. ఈ TVS Apache RTR 310 బైక్‌కు సంబంధించి భారత్‌లో ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రక్రియ ప్రారంభమైంది. నామమాత్రపు ఛార్జీ రూ.3,100లను చెల్లించి ఔత్సాహికులు టీవీఎస్ మోటార్స్ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు.