తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్​ పోల్​లో​ ఆయనదే పైచేయి.. ట్రంప్​ అకౌంట్​ను పునరుద్ధరించిన మస్క్​

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ట్విట్టర్​ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అనే విషయమై మస్క్​ నిర్వహించిన పోల్​లో ట్రంప్​కు యూజర్లు మద్దతు పలికారు. దీంతో ఆయన అకౌంట్​ను పునరుద్ధరించింది ట్విట్టర్​.

trump latest twitter account
trump latest twitter account

By

Published : Nov 20, 2022, 7:59 AM IST

Trump Twitter: అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్ ట్విట్టర్‌ కొనుగోలు గురించి వార్తలు మొదలైనప్పటి నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మస్క్‌ తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ట్రంప్‌ను మళ్లీ ట్విట్టర్‌లోకి తీసుకోవాలా అనే దానిపై ఓటింగ్‌ పెట్టారు. అయితే ఈ పోల్​లో అధిక మంది ట్రంప్​కే మద్దతు ఇవ్వడం వల్ల ట్విట్టర్​ సంస్థ ఆయన అకౌంట్​ను పునరుద్ధరించింది. ఈ మేరకు​ మస్క్ ఆదివారం​ ట్వీట్​ చేశారు.

మస్క్​ ట్వీట్​

అసలు ఎందుకు ట్రంప్​ అకౌంట్​ను తీసేశారంటే ?
2021లో క్యాపిటల్‌ హిల్‌పై దాడి సందర్భంగా ట్రంప్‌ ఖాతాపై ట్విట్టర్‌ శాశ్వత నిషేధం విధించింది. అయితే ఈ ఏడాది ఆరంభంలో ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించినప్పటి నుంచి ట్రంప్‌ ఖాతాను మళ్లీ పునరుద్ధరిస్తారని ఊహాగానాలు వచ్చాయి. దీనిపై ఆ మధ్య మస్క్‌ కూడా స్పందిస్తూ.. అందుకు తాను కూడా అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ట్విట్టర్‌ నిషేధం తర్వాత ట్రంప్‌ సొంతంగా 'ట్రూత్‌' పేరుతో ఓ సోషల్‌మీడియా సంస్థను ప్రారంభించారు. ఒకవేళ.. తన ట్విట్టర్‌ ఖాతాను పునరుద్ధరించినా మళ్లీ అందులో చేరే ఉద్దేశం తనకు లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details