Travel Insurance Benefits : నేటి కాలంలో విద్య, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం ప్రతి ఒక్కరూ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. అలాగే సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి, సరదాగా విహారయాత్రలకు వెళ్లడమూ తప్పనిసరి అవుతోంది. అందుకే ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
ఆపదలో అండగా..
Key Benefits Of Travel Insurance :ప్రయాణాలు చేసేటప్పుడు.. అన్నీ మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కొన్ని సార్లు వైద్య అత్యవసరాలు ఏర్పడవచ్చు. మరికొన్ని సార్లు మన విలువైన సామగ్రి పోవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది.. ప్రయాణ బీమా.
పలు నివేదికల ప్రకారం, డిసెంబర్ - జనవరి నెలల్లో ఈప్రయాణ బీమా అవసరం అధికంగా ఉంటుంది. అందుకే కొన్ని దేశాలు పర్యటకులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేశాయి కూడా.
ఊహించని ఖర్చులు
ఊహించని ఖర్చులు మన ప్రయాణంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. మనం చాలా సందర్భాల్లో ఇలాంటి ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో.. ప్రయాణ బీమా మనకు మంచి భరోసా ఇస్తుంది. అందుకే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకునేటప్పుడు ఏయే అంశాలు పరిశీలించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య అవసరాలకు తగినట్లుగా..
Travel Insurance Medical Coverage : మన దేశం నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యటకులు విదేశాలకు పయనిస్తూ ఉంటారు. అందుకే ఇలాంటివారు తమ అవసరాలకు అనుగుణంగా ప్రయాణ బీమా పాలసీని ఎంచుకోవాలి.
ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో పూర్తి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులు అందించే.. మంచి ప్రయాణ బీమా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా.. అన్ని రకాల వైద్య ఖర్చులను చెల్లించే పాలసీని ఎంచుకోవాలి.
ప్రీమియం తక్కువే!
Travel Insurance Premium : ప్రయాణ బీమా పాలసీలు సాధారణంగా తక్కువ ప్రీమియానికే లభిస్తాయి. అందుకే ఒకేసారి కుటుంబం మొత్తానికి పాలసీ తీసుకోవడం మంచిది. ఈ విధంగా ఒకసారి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే.. అది ఎన్నో ప్రయాణాలకు ఉపయోగపడుతుంది. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఇది బాగా ప్రయోజనకరంగా ఉంటుంది.