Top 7 Safest Cars In India :"కారు" సగటు మనిషికి అదొక చిరకాల కోరిక కోరికైతే.. సంపన్నులకు అదొక హోదా! అందుకే.. కారు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. ఆయా వర్గాలకు తగ్గట్టే తయారీ సంస్థలు కూడా.. కార్లను తయారు చేస్తూ, వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే.. ఇటీవల సేఫ్టీ ఎక్కువ ఉన్న కార్లకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. వీరిని దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమమైన భద్రతా ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తున్నాయి సంస్థలు.
మరి, కార్లలో ఏవి సురక్షితమైనవో తెలుసుకోవాలంటే.. Global New Car Assessment Programme (NCP) క్రాష్ టెస్టులో అర్హత సాధించినవాటిని ఎంచుకోవచ్చు. ఐక్యరాజ్యమితి (యూఎన్‌ఓ) నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను అందుకున్న కార్లకు.. 5 స్టార్స్ రేటింగ్ ఇస్తోంది ఎన్‌సీఎపీ. తాజాగా మార్కెట్లోకి విడుదలైన వాహనాల్లో కొన్ని NCP రేటింగ్‌లో అత్యుత్తమ స్థాయిని అందుకున్నాయి. వాటిలో టాప్ -7లో కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో అత్యంత సురక్షితమైన కార్లు.. (5 Star Rated Cars in India) :
1.టాటా కార్లు (TATA Cars) :NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్ ప్రకారం.. 2023లో భారతదేశంలో తయారు చేసిన అత్యంత సురక్షితమైన కార్లలో.. టాటా హారియర్, టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ కార్లు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP), చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) రెండింటిలోనూ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ పొందాయి. ఈ టాటా SUV కార్లు.. సేఫెస్ట్ కార్ల జాబితాలోని అన్ని ఇతర మోడళ్ల కంటే అత్యధిక స్కోర్‌ను కలిగి ఉన్నాయి. ఈ కార్లలో గరిష్ఠంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ప్రామాణికంగా ఉన్నాయి. ఈ వేరియంట్లలో హిల్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను కూడా ఉన్నాయి.
టాటా హారియర్ (TATA Harrier) ధర :రూ. 15.49 లక్షల నుంచి ప్రారంభం
టాటా సఫారీ (TATA Safari) ధర :రూ. 16.19 లక్షల నుంచి ప్రారంభం
2. వోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) :వోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్ కారు రెండో స్థానంలో ఉంది. ఈ సెడాన్ అత్యంత సురక్షితంగా ఉందని తెలింది. AOP, COP రెండింటిలోనూ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ స్కోర్ చేసింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ సీట్‌బెల్ట్, ప్రయాణికులందరికీ సీట్‌బెల్ట్ రిమైండర్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజెస్ ఉన్నాయి.
వోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) ధర : రూ. 11.48 లక్షల నుంచి రూ. 19.29 లక్షల మధ్య ఉంది.
3. స్కోడా స్లావియా (Skoda Slavia) :భారతదేశంలో తయారు చేసిన అత్యంత సురక్షితమైన కార్లలో స్కోడా స్లావియా కూడా ఉంది. ఈ కారు కూడా AOP, COP రెండు విభాగాల్లోను 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ సీట్‌బెల్ట్, ప్రయాణించే వారందరికీ సీట్‌బెల్ట్ రిమైండర్, ISOFIX చైల్డ్ సీట్ కూడా ఉన్నాయి.
స్కోడా స్లావియా (Skoda Slavia) ధర : రూ. 10.89 లక్షల నుంచి రూ. 19.12 లక్షల మధ్య ఉంది.