Top 7 Dos Donts with Airport Security in Telugu :మీరు సహజంగా ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే విమాన ప్రయాణాలకు మించిన సదుపాయం మరుకొటి ఉండదు. దీని ద్వారా చాలా తక్కువ సమయంలోనే సుదూర ప్రాంతాలకు వెళ్లొచ్చు. అయితే ఎవరైనా విదేశాలకు వెళ్లేటప్పుడు చెకిన్ బ్యాగ్‌లో కొన్ని ముఖ్యమైన వస్తువులు, ఆహార పదార్థాలు ఉంటాయి. అదే విధంగా ఫ్లైట్ జర్నీకి ముందు మీరు విమానాశ్రయ సిబ్బందితో చేయాల్సినవి, చేయకూడనివి కొన్ని నియమాలు తెలుసుకోవాలి. ఎందుకంటే వీటిని తెలుసుకోవడం ద్వారా మీరు మీ ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా హ్యాపీగా జర్నీ చేయవచ్చు. అవి తెలుసుకోకపోతే ఒక్కోసారి విమాన ప్రయాణం(Flight journey) చికాకు తెప్పిస్తుంది. కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఫ్లైట్ జర్నీ సాగాలంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. మరి, ఏవేంటో ఇప్పుడు చూద్దాం..
1. చేయండి(Do) : సిద్ధంగా ఉండండి(Be Prepared)
మీరు విమానాశ్రయానికి వెళ్లే ముందు మీకు కావాల్సిన ప్రతిదాన్ని సిద్ధం చేయడానికి సమయాన్ని వెచ్చించండి. అంటే మీ ప్రయాణ పత్రాలు, మీ పాస్‌పోర్ట్ లేదా ఫొటో ID చెల్లుబాటు అయ్యేలా ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి. ఇది మీకు అన్ని సమయాల్లో తక్షణమే అందుబాటులో ఉండాలి. అందుకే వీటిని లగేజ్ బ్యాగ్ దిగువన ఉంచవద్దు. TSA లైన్ ముందు వాటి కోసం వెతుకులాటలో మీరు అనుభవించే భయాందోళనలు మీకు ఏ విధమైన సహాయం చేయవు. అలాగే మీరు ఏదైనా మందులు వాడుతుంటే వాటిని, ఇతర సాంకేతిక అవసరాలకు వాడే వాటిని సర్దుకున్నారో లేదో చూసుకోవాలి. వాటిని ట్రావెల్ పౌచ్‌లలో క్రమబద్ధంగా ఉంచండి.
2. చేయవద్దు(Don't) : మీకు అదనపు సమయం ఇవ్వడం మర్చిపోండి(Forget to Give Yourself Extra Time)
పోస్ట్-పాండమిక్ ట్రావెల్ బూమ్ కొనసాగుతున్నందున ఎక్కువ మంది ప్రయాణీకులు U.S., ప్రపంచంలోని ఇతర విమానాశ్రయాల ద్వారా వస్తుంటారు. కాబట్టి తరచుగా సెక్యూరిటీ చెకప్ వద్ద పొడవైన క్యూలు, అధిక నిరీక్షణ సమయం పడుతోంది. అప్పుడు మీ వంతు సహకారం అందించాలి. అంటే మీరు అదనపు సమయంతో విమానాశ్రయానికి చేరుకునేలా చూసుకోవాలన్నమాట. కాస్త ముందుగానే ఎయిర్‌పోర్టులకు చేరుకోవడం ద్వారా ఎలాంటి ఒత్తిడి లేకుండా జర్నీ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు గేట్ వద్దకు వెళ్లేటప్పుడు విలువైన వ్యక్తిగత వస్తువులను వదిలివేయడం వంటి పనులు చేయకండి.
విమానం దిగగానే లగ్జరీ కార్లలో ప్రయాణం..
3. చేయండి(Do) : TSA ప్రీచెక్‌లో పెట్టుబడి పెట్టండి(Invest in TSA PreCheck)
సమయం విలువైనది. మీరు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు కంటే ఎక్కువ విమాన ప్రయాణాలు చేస్తున్నారా? అయితే ఇది TSA ప్రీచెక్‌లో పెట్టుబడి పెట్టడండి. మీరు అంతర్జాతీయంగా ప్రయాణించినట్లయితే గ్లోబల్ ఎంట్రీ మరింత మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రీచెక్ సభ్యత్వంతో అది కూడి ఉంటుంది. దీని ద్వారా ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో మీ చెకప్ అయిపోతుంది. అలాగే మీకు అర్హత ఉంటే, మీరు బూట్లు, బెల్ట్‌లు, లైట్ జాకెట్‌లు, ఎలక్ట్రానిక్స్ లేదా ల్యాప్‌టాప్‌లు లేదా మీ క్యారీ ఆన్ లిక్విడ్‌లను తీసివేయాల్సిన అవసరం లేదు.
4. చేయవద్దు(Don't) : నిషేధిత వస్తువులను తీసుకెళ్లవద్దు(Don't Bring Prohibited Items)
TSAచే నిషేధించబడిన వస్తువులతో చాలా మంది ప్రయాణికులు లిమానాశ్రయాలకు వస్తుంటారు. కానీ వారిని విమానాశ్రయ భద్రత సిబ్బంది TSA చెక్‌పాయింట్‌ల వద్ద చెకప్ చేసి వాటిని స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి మీరు విమాన ప్రయాణం చేసేటప్పుడు నిషేధిత వస్తువులను తీసుకెళ్లకపోవడం మంచిది.