Top 5 ev cars 2023 : ప్రస్తుతం ఆటోమొబైల్స్ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీలు). పర్యావరణానికి అనుకూలంగా ఉండటం వల్ల చాలా మంది వీటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఈవీ కార్ల ఉత్పత్తి సంస్థల చెబుతున్నాయి. అయితే ఈ టాప్ 5 ఎలక్ట్రిక్ వెహికిల్లు ఏవి? వాటి ప్రత్యేకతలేంటి? ఎన్ని నిమిషాల్లో ఛార్జ్ అవుతాయి మొదలైన వివరాలు మీ కోసం..
MG Motor Comet :MG మోటార్ కామెట్ ఈ సంవత్సరం ప్రారంభంలో కాంపాక్ట్ ఈవీను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ZS ఎలక్ట్రిక్ వెహికిల్ తర్వాత విడుదైలన వాటిలో ఇది రెండోది. ఈ కారు 17.3 KWH సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. ARAI ప్రకారం ఒక సారి ఫుల్ ఛార్జ్‌తో ఈ కారు 230కి. మీ ప్రయాణిస్తుంది. 42 bhp, 110NM టార్క్‌ను విడుదల చేస్తుంది. 17.3 KWH బ్యాటరీ వేరియంట్ 3.3KW సామర్థ్యం గల ఛార్జర్‌తో వస్తుంది. 5.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
Tata Tiago EV :టాటా టియాగో 19.2 Kwh, 24 Kwh బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. ఎంట్రీ లెవల్ టియాగో 60.3bhpతో 110 NM అవుట్‌పుట్‌ను ఇస్తుంది. టాప్ మోడల్ 74 బిహెచ్పి, 114 NM టార్క్‌తో పనిచేస్తుంది. 19.2KWH వేరియంట్‌ను ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 24Kwh ట్రిమ్ వేరియంట్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 350 కిలోమీటర్లు దూరం వరకు వెళ్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి 19.Kwh 15A వాల్ ఛార్జర్‌తో వస్తున్న ఈ వాహనం పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు సుమారు 6.9 గంటల సమయం పడుతుంది. అంతకుముందు ఛార్జింగ్‌కు అయ్యే సమయం 8.7 గంటలు సమయం పట్టేది. 7.2KW ఛార్జర్‌తో 2.6 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అంతకుముందు ఛార్జింగ్‌కు అయ్యే సమయం 3.6 గంటలు పట్టేది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో టాటా టియాగో 19.2Kwh, 24Kwh 10-80శాతం 50 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతాయి.
Citroen eC3 EV :ఈ Citroen eC3 ఎలక్ట్రిక్ వెహికిల్ 29.2KW బ్యాటరీతో పాటు 76 బీహెచ్పీ, 143NM టార్క్‌ను కలిగి ఉంది. సిట్రాన్ కంపెనీ ప్రకారం ఈ ఈవీ కారు గంటకు 107 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. 15Amp ప్లగ్, సీ3 ఛార్జర్ ద్వారా 10 గంటల 30 నిమిషాల్లో 100శాతం ఛార్జింగ్ అవుతుంది. Dc ఫాస్ట్ ఛార్జర్‌తో 57 నిమిషాల్లోనే 10-80శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఒక సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఈవీ కారు ధర రూ.11.61 లక్షలు నుంచి రూ.12.49 లక్షలుగా ఉంది.