తెలంగాణ

telangana

ETV Bharat / business

Top 5 Best Selling Smart Watches in Amazon Sale : తక్కువ ధరకే స్మార్ట్​వాచ్ కొందామనుకుంటున్నారా?.. అయితే అమెజాన్​ సేల్​లో వీటిపై ఓ లుక్కేయండి.! - అమెజాన్​లో ఎక్కువ అమ్ముడవుతున్న స్మార్ట్​వాచ్​లు

Top 5 Best Smart Watches in Amazon Sale : స్మార్ట్‌వాచ్‌ కొందామని ప్లాన్‌ చేస్తున్నారా? పండగ సీజన్‌ అందుకు మంచి అవకాశం. ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్.. ప్రారంభించిన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్​లో స్మార్ట్‌వాచ్‌లు, ఫోన్లు సహా అనేక వస్తువులపై ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. చాలా తక్కువ ధరకే బ్రాండెడ్ వాచ్​లు లభిస్తున్నాయి. మరి, ఏ స్మార్ట్​వాచ్​పై ఎలాంటి డిస్కౌంట్​లు ఉన్నాయో చూద్దామా..

Smart Watch
Smart Watch

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 3:11 PM IST

Top 5 Best Selling Smart Watches in Amazon Sale :ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండగ సీజన్ హడావుడి మొదలయింది. ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో ఇ- కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్స్ ప్రారంభించాయి. ఈ సమయంలో చాలా మంది ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్​తో పాటు స్మార్ట్‌ఫోన్లు, వాచ్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్లనూ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2023(Amazon Great Indian Festival sale 2023)ను ఈ నెల 8న ప్రారంభించింది.

Amazon Great Indian Festival 2023 Offers :అందులో భాగంగా వివిధ రకాల వస్తువులపై రాయితీలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేసేవారికి అమెజాన్‌ 10 శాతం రాయితీ కూడా ఇస్తోంది. షావోమి, వన్‌ప్లస్‌ వంటి సంస్థలు కూడా అదనపు ఆఫర్లను ఇస్తున్నాయి. ఈ సేల్​లో భాగంగా పలు కంపెనీల స్మార్ట్​వాచ్​ల(Smart Watches)పై భారీ రాయితీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కువ అమ్ముడుపోతున్న టాప్ 5 స్మార్ట్​వాచ్​లను మీకు తెలియజేస్తున్నాం. అవేంటో తెలుసుకుని మీరు ఓ వాచ్​కి ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి.

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 4 బ్లూటూత్‌ (Samsung Galaxy Watch 4) :అమెజాన్​ సేల్​లో శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ స్మార్ట్‌వాచ్‌లు 40mm, 44mm సైజ్‌ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 44mm శాంసంగ్ గెలాక్సీ వాచ్‌ 4 బ్లూటూత్‌ వేరియంట్‌ అన్ని ఆఫర్లతో కలిపి ప్రస్తుతం రూ.7,999కు లభిస్తోంది. ఈ వాచ్ రూ.26,999 వద్ద మార్కెట్‌లోకి ప్రవేశించింది. మార్కెట్ ధరతో పోలిస్తే ప్రస్తుతం ఈ వాచ్‌ 70 శాతం డిస్కౌంట్‌పై అమెజాన్​ సేల్​లో లభిస్తోంది. ఇటీవలే శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌కు వేర్‌ ఓఎస్‌ 4- ఆధారిత వన్‌ యూఐ 5 అప్‌డేట్‌ను అందించింది. ఈ స్మార్ట్​ వాచ్‌లు ఎగ్జినోస్‌ W920 ప్రాసెసర్‌, 1.5జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌తో వస్తున్నాయి.

అమేజ్‌ఫిట్‌ జీటీఎస్‌ 4 మినీ వాచ్ (Amazfit GTS 4 Mini) :2022 జులైలో విడుదలైన అమేజ్‌ఫిట్‌ జీటీఎస్‌ 4 మినీ స్మార్ట్​ వాచ్ ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో రూ.7,999కే లభిస్తోంది. మార్కెట్​లో దీని ఒరిజినల్‌ ధర రూ.10,999. 1.65 అంగుళాల డిస్​ప్లేతో వస్తోన్న ఈ వాచ్‌లో బిల్ట్‌-ఇన్‌ అలెక్సా ఫీచర్‌ ఉంది. అలాగే 120 స్పోర్ట్స్‌ మోడ్‌లతో పాటు ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ కూడా ఇందులో ఉంది. ఈ స్మార్ట్​వాచ్ ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది.

IPhone Offers In October 2023 : ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ పండుగ సేల్​లో.. రూ.40 వేలకే ఐఫోన్​ 13.. రూ.20,000 డిస్కౌంట్​తో ఐఫోన్​ 14!

వన్‌ప్లస్‌ నార్డ్‌ వాచ్‌ (OnePlus Nord Watch) :ప్రస్తుత పండగ సీజన్‌లో వన్‌ప్లస్‌ కంపెనీ తమ ఉత్పత్తులపై మంచి ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలో అమెజాన్​ సేల్​లో వన్​ప్లస్ నార్డ్‌ వాచ్​పై 40% ప్రకటించింది. ప్రస్తుతం ఇది రూ.3,999కే లభిస్తోంది. రూ.6,999 ధర వద్ద ఈ వాచ్ మార్కెట్‌లోకి వచ్చింది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1.78 అంగుళాల అమోలెడ్‌ డిస్​ప్లేతో వస్తోన్న ఈ వాచ్‌లో 105 ఫిట్‌నెస్‌ మోడ్‌లు ఉన్నాయి. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది.

అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఎస్‌ స్మార్ట్‌వాచ్‌ (Amazfit Pop 3S Smartwatch) :అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఎస్‌ స్మార్ట్​వాచ్‌ అమెజాన్ తాజా సేల్​లో రూ.2,999కే లభిస్తోంది. సాధారణ సమయంలో ఈ వాచ్ ధర రూ.3,499గా ఉంటుంది. 1.96 అంగుళాల అమోలెడ్‌ డిస్​ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ ఉంది. ఇందులో ఏఐ వాయిస్‌ అసిస్టెన్స్‌ కూడా ఉంది. 12 రోజుల వరకు దీని బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. అదే విధంగా 100 వాచ్‌ ఫేస్‌లు, 100 స్పోర్ట్స్‌ మోడ్‌లు ఈ వాచ్​లో అందుబాటులో ఉన్నాయి.

బోట్‌ ఎక్స్‌టెండ్‌ ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ (boAt Xtend Plus Smartwatch) :తాజా అమెజాన్‌ సేల్‌లో ఎక్స్‌టెండ్‌ ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ను బోట్‌ రూ.1,998కే అందిస్తోంది. మార్కెట్​లో దీని లాంఛ్‌ ధర రూ.9,499గా ఉంది. ఈ స్మార్ట్​వాచ్​లో 1.78 అంగుళాల అమోలెడ్‌ డిస్​ప్లే ఇస్తున్నారు. అలాగే ఇందులో అనేక ఆరోగ్య శ్రేణి ఫీచర్లు ఉన్నాయి. 100 స్పోర్ట్స్‌ మోడ్‌లు దీనిలో అందుబాటులో ఉన్నాయి. దీనిని ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. ఏడు రోజుల వరకు వస్తుందని కంపెనీ తెలిపింది.

Amazon Great Indian Festival 2023 Offers : రూ.10వేల ఇయర్​బడ్స్​​ రూ.700కే.. రూ.12వేల స్మార్ట్​వాచ్​ రూ.2 వేలకే.. అదిరే ఆఫర్లతో అమెజాన్​..

Amazon Great Indian Festival 2023 : స్మార్ట్​ఫోన్స్​పై 49%, ల్యాప్​టాప్స్​పై 45% వరకు డిస్కౌంట్​.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ కిరాక్​ డీల్స్​​!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details