తెలంగాణ

telangana

ETV Bharat / business

Low Interest Home Loans : తక్కువ వడ్డీకే హోమ్​ లోన్స్​.. టాప్​ 5 బ్యాంకులివే..

Low Interest Home Loans : ఇల్లు కట్టుకోవాలనే కల అందరికి ఉంటుంది. అయితే అందుకోసం చాలామంది గృహ రుణాలను అందించే బ్యాంకుల వైపే మొగ్గు చూపిస్తుంటారు. అయితే ఏ బ్యాంకైతే తక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తుందో ఆ బ్యాంక్​ ఇచ్చే లోన్స్​​నే తీసుకునేందుకు ముందుకొస్తుంటారు. మరి మన దేశంలో తక్కువ వడ్డీ రేట్లతో హౌసింగ్​ లోన్​ ఇస్తున్న టాప్​ 5 బ్యాంకులేవో తెలుసా..?

Low Interest Home Loans Top 5 Best Banks Providing Home Loans With Low Interest Rates SBI Offer To Customers On Home Loans Processing Fees sbi home loan processing fee waiver
అతి తక్కువ వడ్డీ రేట్లతో హౌసింగ్​ లోన్స్​ ఇచ్చే టాప్​ 5 బ్యాంకులివే.. ఎస్​బీఐ బంపర్​ ఆఫర్​..

By

Published : Jul 18, 2023, 5:37 PM IST

Low Interest Home Loans : దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులన్నీ తమ వినియోగదారుల కోసం గృహ రుణాలు అందిస్తుంటాయి. అయితే ఈ రుణాలపై ఒక్కో బ్యాంక్​ ఒక్కో వడ్డీ రేటును వడ్డిస్తుంటాయి. కొన్ని బ్యాంకుల అతి తక్కువ వడ్డీ రేట్లతో హోమ్​​ లోన్స్​ను కస్టమర్స్​కు అందిస్తే.. మరి కొన్నేమో భారీగా ఇంట్రెస్ట్​ రేట్​ను విధిస్తుంటాయి. అయితే దేశంలో అతి తక్కువ వడ్డీ రేట్లతో గృహ రుణాలు ఇస్తున్న టాప్​ 5 బ్యాంకులివే..

Top Banks For Home Loan : హోమ్​ లోన్స్​పై అతి తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న టాప్​ 5 బ్యాంకులివే..

  1. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​- 8.45 శాతం నుంచి 9.85 శాతంతో గృహ రుణాలను అందిస్తోంది.
  2. ఇండస్​ఇండ్​ బ్యాంక్​- 8.5 శాతం నుంచి 9.75 శాతంతో హోమ్​ లోన్స్​ను అందిస్తోంది.
  3. ఇండియన్ బ్యాంక్- 8.5 శాతం నుంచి 9.9 శాతం వడ్డీ రేట్లతో హోమ్​ లోన్స్​ను వినియోగదారులకు అందిస్తోంది.
  4. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.6 శాతం నుంచి 9.45 శాతం వడ్డీతో గృహ రుణాలను ఇస్తోంది.
  5. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 8.6 శాతం నుంచి 10.3 శాతం వడ్డీ రేట్లతో గృహ రుణాలను అందిస్తోంది.

ఎస్​బీఐ బంపర్​ ఆఫర్​.. కొద్ది రోజులు మాత్రమే..
SBI Home Loan Processing Fee : మరోవైపు గృహ రుణాలకు సంబంధించి వినియోగదారులకు శుభవార్త వినిపించింది బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్​ బ్యాంక్​ ఆప్​ ఇండియా (ఎస్​బీఐ). హోమ్​ లోన్స్​ ప్రాసెసింగ్​ ఫీజు చెల్లింపులపై 50 నుంచి 100 శాతం మేర రాయితిని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మాఫీ అన్ని రకాల గృహ రుణాలతో పాటు ఇతర హోమ్​ లోన్‌లకూ వర్తిస్తుంది.

చివరితేదీ ఆరోజే..
SBI Home Loan Processing Fee Waiver 2023 : గృహ రుణాల ప్రాసెసింగ్ ఫీజుపై 50% మాఫీని అందిస్తోంది ఎస్​బీఐ. సాధారణ గృహ రుణాలు, ఫ్లెక్సీపే హోమ్​ లోన్స్, ఎన్‌ఆర్‌ఐ రుణాలు, జీతం లేని రుణాలు, ప్రివిలేజ్ లోన్‌లు సహా మరికొన్ని రకాల హౌసింగ్​ లోన్స్​కు ఈ రాయితీని వర్తింపజేయనున్నారు. అయితే ఈ అవకాశం కేవలం 2023, ఆగస్టు 31 వరకే అందుబాటులో ఉండనుందని ​ తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రతి వినియోగదారుడికి.. జీఎస్​టీతో కలుపుకొని కనిష్ఠంగా రూ.2,000 నుంచి గరిష్ఠంగా రూ.5,000 వరకు డబ్బులు ఆదా కానున్నాయి. దీంతో పాటు టేకోవర్‌లు, రీ-సెల్లింగ్​కు సిద్ధంగా ఉన్న గృహాలపై ఎటువంటి ప్రాసెసింగ్​ రుసుమును తీసుకోరు. అంటే 100% మినహాయింపు లభించనుంది. అయితే ఇన్​స్టా హోమ్​ టాప్​ అప్​, రివర్స్​ మార్టి​గేజ్​తో పాటు ఇతర గృహ రుణాలకు ఈ ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వర్తించదు.

ABOUT THE AUTHOR

...view details