తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫారం-16 అందుకున్నారా?.. అయితే ఈ వివరాలు సరిచూసుకోండి - ఫారమ్​ 16 పాయింట్లు

ఉద్యోగుల ఆదాయపు పన్ను లెక్క తేల్చడంలో ఫారం 16 ఎంతో కీలకమైన పత్రం. యాజమాన్యం తన ఉద్యోగి ఆర్జించిన ఆదాయం, పొందిన మినహాయింపులు, చెల్లించిన పన్నుకు సంబంధించిన టీడీఎస్‌ వివరాలన్నింటితో దీనిని జారీ చేస్తుంది. ఇప్పటికే సంస్థలు ఈ పత్రాన్ని ఉద్యోగులకు అందించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇందులో వేటిని సరిచూసుకోవాలో తెలుసుకోండి.

form 16
form 16

By

Published : Jun 25, 2022, 9:20 AM IST

ఆర్థిక సంవత్సరంలో మీరు ఆర్జించిన ఆదాయం, చెల్లించిన పన్ను వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు ఫారం 26ఏఎస్‌లో ఉంటాయి. టీడీఎస్‌/టీసీఎస్‌ ద్వారా మినహాయించిన పన్ను మొత్తాలను ఆదాయపు పన్ను శాఖకు జమలాంటి అంశాలూ తెలుసుకోవచ్చు. ఫారం 16, ఫారం 26ఏఎస్‌లో తెలియజేసిన వివరాల మధ్య వ్యత్యాసం ఉంటే.. వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. ఆదాయపు పన్ను వెబ్‌సైటులోకి వెళ్లి, ట్రేసెస్‌ నుంచి ఫారం 26ఏఎస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

  • ఫారం 16 అందుకోగానే.. అందులో మీ పేరు, పాన్‌ నెంబరులాంటి వివరాలు సరిగ్గానే ఉన్నాయా లేదా చూసుకోండి. కొన్నిసార్లు పాన్‌ నెంబరు తప్పుగా నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు మీరు చెల్లించిన పన్ను మీ పాన్‌ ఖాతాలో జమ కాదు.
  • మీరు ఇప్పటికే చెల్లించిన ముందస్తు పన్ను వివరాలు 26ఏఎస్‌లో నమోదవుతాయి.
  • ఫారం 16 పార్ట్‌ ఏలో మీ పేరు, చిరునామా, మీ పాన్‌, యాజమాన్యం టాన్‌, పాన్‌ వివరాలు కనిపిస్తాయి. మీ దగ్గర నుంచి వసూలు చేసిన పన్నును ప్రతి మూడు నెలలకోసారి పన్ను విభాగానికి జమ చేసిన వివరాలూ తెలుసుకోవచ్చు.
  • పార్ట్‌ బిలో మీకు వచ్చిన ఆదాయమెంత అనే వివరాలూ పూర్తి స్థాయిలో తెలియజేస్తారు. మినహాయింపులు, పన్ను చెల్లింపు తదితరాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ వివరాలనే మీరు ఐటీఆర్‌-1లో పేర్కొనాల్సి ఉంటుంది. రుణం తీసుకోవాలనుకున్నప్పుడు కనీసం మూడు నాలుగేళ్ల ఫారం-16ను అడుగుతుంటారు. కాబట్టి, పీడీఎఫ్‌ రూపంలో లేదా ప్రింట్‌ చేసుకొని, వీటిని జాగ్రత్త చేసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details