Tips to Increase Clutch Life Time in Manual Cars:కారు కొనుగోలు చేసి.. ఫ్యామిలితో ట్రిప్స్‌కు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. ఆ అవసరాలకు తగ్గట్టుగానే కార్లను కొంటున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లో కార్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఆటోమేటిక్ గేర్ కార్లు వచ్చినప్పటికీ.. కార్ లవర్స్ మాత్రం మాన్యువల్ గేర్ కార్లనే ఎక్కువగా ఇష్టపడతున్నారు. అయితే ఈ కార్లలో ఓ మెయిన్ ప్రాబ్లమ్ ఉంది. అదే క్లచ్. కొద్దిమందికి కారు డ్రైవ్ చేసే సమయంలో క్లచ్‌ని ఎప్పుడు ప్రెస్ చేయాలి..? ఎప్పుడు ఉపయోగించకూడదో తెలియడం లేదు. అయితే దీని వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని.. క్లచ్ లైఫ్ టైమ్‌కు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని అంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు..
ఈ 5 టూల్స్ మీ కారులో ఉంటే చాలు - షోరూమ్ బండిలా ఉంటుంది!
Clutch Maintenance: మాన్యువల్ గేర్ కార్లలో క్లచ్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ క్లచ్ పాడైపోతే కారు వర్క్ అవ్వదు. క్లచ్.. ఇంజిన్, గేర్‌బాక్స్ మధ్య వంతెనలా పనిచేస్తుంది. కాబట్టి కారు డ్రైవ్ చేసే సమయంలో క్లచ్‌ను కేర్‌ఫుల్‌గా ఉపయోగించాలి. దీని ద్వారా, కారు రిపేర్ అవ్వకుండా చూసుకునే వీలుంటుంది. లేదంటే మెయింటెనెన్స్‌పై చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ తప్పులను చేయకుండా ఉండటం ద్వారా క్లచ్ లైఫ్ టైమ్‌ను పెంచుకోవడంతో పాటు మైలేజ్‌ను కూడా ఆదా చేసుకోవచ్చు..
క్లచ్ అండ్ యాక్సిలరేటర్:ఎత్తైన రోడ్లు ఎక్కేటప్పుడు కారు డ్రైవ్ చేసేవారు.. తరచుగా బ్రేక్ బదులు క్లచ్ ఇంకా యాక్సిలరేటర్‌ను యూజ్ చేస్తారు. ఈ కారణంగా కారు క్లచ్ వేగంగా హీటెక్కుతుంది. కొన్నిసార్లు దెబ్బతింటుంది కూడా. ఎక్కువ ఎత్తులో క్లచ్, యాక్సిలరేటర్ ఎక్కువగా వాడటం వల్ల క్లచ్ లైఫ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా క్లచ్ ప్లేట్స్ త్వరగా అరిగిపోతాయి. క్లచ్ కారును వెనుకకు వెళ్లకుండా ఉండటానికి ఎక్కువ శక్తిని గేర్ ట్రాన్స్మిషన్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది, కానీ ఈ మొత్తం ప్రక్రియ చాలా హీట్‌ను జనరేట్ చేస్తుంది. ఇది క్లచ్ ఫెయిల్ లేదా అగ్ని ప్రమాదాలను పెంచే అవకాశం ఉంటుంది.
మీ కారు విండ్ షీల్డ్‌పై పగుళ్లు వచ్చాయా? ఇలా సెట్ చేయండి!
క్లచ్‌పై ప్రెజర్ పెట్టకూడదు: మాన్యువల్ కార్ డ్రైవర్లు ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటంటే.. క్లచ్‌పై చాలా వేగంగా ప్రెజర్ పెడుతుంటారు. లేదా సడెన్‌గా దానిపై నుంచి కాలు తీస్తారు. అలా కాకుండా స్లోగా క్లచ్‌పై కాలు పెట్టడం, తీయడం చేయాలి. అప్పుడే క్లచ్ సేఫ్‌గా ఉంటుంది.