third party insurance: వాహనదారులకు షాక్ ఇచ్చింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు జూన్ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు - థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
third party insurance: థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. పెరిగిన ధరలు జూన్ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది.
third party insurance
కొవిడ్ కాలంలో మారటోరియం విధించిన కేంద్రం.. రెండేళ్ల అనంతరం తిరిగి జూన్ 1న అమలు చేయనుంది. అంతకుముందు బీమా నియంత్రణ ప్రాధికార, అభివృద్ధి సంస్థ వీటిని నిర్ణయిస్తుండగా.. ఆ సంస్థ సహకారంతో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం వీటిని సవరించింది. కాగా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రీమియంలో 7.5 శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
- 1000సీసీ గల ప్రైవేట్ కార్లకు గతంలో రూ. 2,072 ఉండగా.. ప్రస్తుతం రూ. 2,094కు పెంచింది.
- 1000సీసీ నుంచి 1500సీసీ ప్రైవేట్ కార్లకు రూ. 3,221 ఉండగా.. ఇప్పుడు రూ.3,416 కానుంది.
- 1500సీసీ పైబడిన సొంత కార్ల ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890కి తగ్గింది.
- 150సీసీ ద్విచక్రవాహనాలకు రూ.1,366గా, 350 సీసీ వాహనాలకు రూ.2,804 గా నిర్ణయించింది.
- 30 కిలోవాట్ లోపు గల ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్ల ప్రీమియం రూ.1,780
- 30 నుంచి 65 కిలోవాట్ మధ్య గల వాహనాల ప్రీమియం ఖరీదు రూ. 2,904
- 12,000 కిలోల సరుకు రవాణా వాహనాలకు గతంలో రూ.35,313 ఉండగా ప్రస్తుతం రూ.33,414కు పెంచింది.
- 40,000 కిలోల పైబడిన సరుకు రవాణా వాహనాలకు ప్రీమియంను రూ.41,561 నుంచి 44,242 కు పెంచింది.
ఇదీ చదవండి:గ్రెటా ఎలక్ట్రిక్ కొత్త విద్యుత్ స్కూటర్.. విడిగానే బ్యాటరీ, ఛార్జర్!