Things To Check Before Buying Land : ఇండియాలో నేడు రియల్ ఎస్టేట్ బిజినెస్ మంచి ఊపు మీద ఉంది. అందుకే చాలా మంది పొలాలు, ప్లాట్లు, ఫ్లాట్లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి లాభాలు అందిస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ రంగంలో రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక మదుపరులు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రీసెర్చ్ చేయాలి :
- రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టుబడులు పెట్టే ముందు కచ్చితంగా.. మీరు కొనాలని అనుకుంటున్న ప్రోపర్టీపై రీసెర్చ్ చేయాలి. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు గురించి తెలుసుకోవాలి. అంటే వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, మురికి కాలువలు, రవాణా సౌకర్యాలు ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోవాలి. అలాగే సమీప పట్టణాలతో కనెక్టివిటీ ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి.
- మరీ ముఖ్యంగా సదరు ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అలాగే వ్యాపార అభివృద్ధికి, ఉద్యోగితకు అనుకూలంగా ఉందో? లేదో చెక్ చేసుకోవాలి.
- అన్నింటి కంటే ముఖ్యమైనది.. సదరు ప్రోపర్టీకి మార్కెట్లో ఉన్న అసలు విలువ ఎంతో తెలుసుకోవాలి. దీని వల్ల రియల్ వాల్యూకే ప్రోపర్టీని కొని, తరువాత కాలంలో మంచి లాభాలు గడించడానికి వీలవుతుంది.
ఆస్తి పత్రాలను వెరిఫై చేయాలి..
Documents Checklist For Buying A Plot In 2023 : ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు టైటిల్ డీడ్ ఎవరి పేరు మీద ఉందో కచ్చితంగా తెలుసుకోవాలి. చాలా సార్లు ఆస్తుల యాజమాన్యం విషయంలో వివాదాలు ఉంటాయి. లేదా బ్యాంకు రుణాలు ఉంటాయి. కనుక భవిష్యత్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. ఆస్తులకు సంబంధించిన అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అనేది ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.
లోకల్ బాడీ అప్రూవల్ ఉండాలి!
- భారతదేశంలోని రియల్ ఎస్టేట్ చట్టాల ప్రకారం, భూములకు లేదా ఆస్తులకు కచ్చితంగా లోకల్ అథారిటీస్ అప్రూవల్ ఉండాలి. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు వివిధ అవసరాల కోసం.. భూమిని పలు కేటగిరీలుగా విభజించి ఉంటాయి. అందువల్ల ఆయా కేటగిరీ భూములు లేదా స్థలాలు కొనాలన్నా, వాటిలో నిర్మాణాలు చేపట్టాలన్నా లోకల్ అథారిటీస్ అప్రూవల్ కచ్చితంగా ఉండాలి.
- ముంబయి, దిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో జోనల్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందువల్ల ఆయా ప్రాంతాల్లో రెసిడెన్సియల్, కమర్షియల్ నిర్మాణాలు చేపట్టాలంటే కచ్చితంగా లోకల్ అథారిటీ అప్రూవల్ తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్లో న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
- ప్రోపర్టీలను కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ను తనిఖీ చేయాలి. ఎందుకంటే.. దీనిలో సదరు ఆస్తికి సంబంధించిన నిజమైన యాజమాని వివరాలు, బ్యాంకు రుణాలు సహా అన్ని వివరాలు ఉంటాయి.