Tesla Cybertruck Launch :అపర కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ ఎట్టకేలకు అమెరికాలో 'సైబర్‌ట్రక్'ను లాంఛ్ చేసింది. అంతేకాదు మొదటి 10 మంది కస్టమర్లకు వాటిని డెలివరీ కూడా చేసేసింది.
కాస్త ఆలస్యమైంది.. కానీ
Tesla Cybertruck Details :వాస్తవానికి టెస్లా కంపెనీ నాలుగేళ్ల క్రితమే.. ఈ టోటల్ బుల్లెట్ ప్రూఫ్ సైబర్‌ట్రక్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. కానీ దీనిని మార్కెట్లోకి తేవడానికి చాలా సమయం తీసుకుంది. కానీ అందరి అంచనాలకు మించి... సూపర్లుక్తో, స్టన్నింగ్ ఫీచర్స్‌తో దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది.
3 వేరియంట్లలో..
Tesla Cybertruck Variants :టైస్లా ఈ సైబర్‌ట్రక్‌ను 3 వేరియంట్లతో అందుబాటులోకి తెచ్చింది.
- బేస్ లెవల్ వేరియంట్ RWD డ్రైవ్‌ట్రెయిన్ వస్తుంది.
- మిడ్ స్పెక్ వేరియంట్ AWD డ్రైవ్‌ట్రెయిన్ కలిగి ఉంటుంది.
- టాప్ స్పెక్ వేరియంట్ అయిన సైబర్‌బీస్ట్ కూడా AWD డ్రైవ్ట్రెయిన్నే కలిగి ఉంటుంది.
ప్రస్తుతానికి టెస్లా AWD డ్రైవ్‌ట్రెయిన్, సైబర్‌బీస్ట్ వేరియంట్లను మాత్రమే డెలివరీ చేయనుంది. RWD డ్రైవ్‌ట్రెయిన్ వేరియంట్‌ను వచ్చే ఏడాది నుంచి డెలివరీ చేయనున్నట్లు టెస్లా తెలిసింది.
సైబర్‌ట్రక్ శక్తి అద్భుతం!
Tesla Cybertruck Strength And Durability :
- టెస్లా కంపెనీ ఈ సైబర్‌ట్రక్ ఎక్స్టీరియర్ను పూర్తిగా బుల్లెట్‌ప్రూఫ్‌గా తీర్చిదిద్దింది. దీని కోసం పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌ను వాడింది. టెస్లా ఈ సైబర్‌ట్రక్ శక్తిని నిరూపించేందుకు.. లాంఛ్ ఈవెంట్లో ఒక వీడియోను డిస్ప్లే చేసింది. దీనిలో సైబర్ట్రక్పై బుల్లెట్ల వర్షం కురిపించారు. కానీ ట్రక్కు ఏమీ కాకపోవడం విశేషం.
- సైబర్‌ట్రక్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో చూపించడం కోసం మరో వీడియోను కూడా టెస్లా ప్రదర్శించింది. దీనిలో సైబర్‌ట్రక్.. ఒక పోర్స్చే (Porsche) 911ను లాగుతూ.. మరొక పోర్స్చే 911తో పోటీ పడుతుంది. చివరికి పోర్స్చే 911 కంటే ముందే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
- టెస్లా ప్రకారం, ఈ సైబర్‌ట్రక్ కేవలం 11 సెకెన్ల వ్యవధిలో పావు మైలు దూరం ప్రయాణించగలదు. అలాగే ఇది డ్యూయెల్-మోటార్ సెటప్‌తో 4.5 టన్నుల వరకు, ట్రిపుల్-మోటార్ సెటప్‌తో 6.30 టన్నుల బరువును లాగగలదు.