Twitter Elon Musk: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. సోమవారం విడుదల చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం దాదాపు 73.5 మిలియన్ షేర్లను తీసుకున్నారు. మస్క్ ధీర్ఘకాలిక మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టారు. గతంలో ట్విట్టర్ సామర్థ్యంపై, వాక్ స్వాతంత్య్రంపై మస్క్ అనేక ప్రశ్నల్ని సంధించారు. దీంతో పాటు కొత్త సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు.
ట్విట్టర్ షేర్లు కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ - tesla share price
Twitter Elon Musk: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్లో పెట్టుబడి పెట్టారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఇందులో భాగంగా దాదాపు 73.5 మిలియన్ షేర్లను కొనుగోలు చేశారు.
ఎలాన్ మస్క్
మస్క్ పెట్టుబడుల విషయం తెలిసి సోమవారం మార్కెట్ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్లు 25 శాతం పెరిగాయి. అదే సమయంలో టెస్లా షేర్లు కూడా స్వల్పంగా పెరిగాయి. టెస్లా మొదటి త్రైమాసిక ఉత్పత్తి ఫలితాలను నమోదు చేసిన రెండు రోజుల తర్వాత మస్క్.. ట్విట్టర్ వాటా కొనుగోలు గురించి వెల్లడించారు. టెస్లా ఈ త్రైమాసికంలో 3,10,000 వాహనాలు డెలివరీ చేసినా.. అంచనాలను అందుకోలేకపోయింది.
ఇదీ చదవండి:హెచ్డీఎఫ్సీ డీల్‌తో బుల్ జోరు.. సెన్సెక్స్ 1300 ప్లస్
Last Updated : Apr 4, 2022, 6:50 PM IST