తెలంగాణ

telangana

ETV Bharat / business

జాబ్ చేయడానికి బెస్ట్​ కంపెనీ TCS.. సిటీస్​ లిస్ట్​లో బెంగళూరు టాప్ - డిస్నీ లేఆఫ్స్

భారత్‌లో పనిచేసే వాతావారణం బాగున్న అత్యుత్తమ సంస్థగా టీసీఎస్‌ నిలిచింది. తర్వాత స్థానాల్లో వరుసగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్​, మోర్గాన్ స్టాన్లీ నిలిచాయి.

best place to work in india 2023
best place to work in india 2023

By

Published : Apr 19, 2023, 6:50 PM IST

Updated : Apr 19, 2023, 8:41 PM IST

దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- టీసీఎస్.. ఈ ఏడాది దేశంలో అత్యుత్తమ వర్క్‌ ప్లేస్‌ కలిగిన (మెరుగైన పని వాతావరణం) సంస్థగా నిలిచింది.​ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్​, అమెరికన్ బ్యాంక్ మోర్గాన్‌ స్టాన్లీ.. వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ విషయాన్ని ప్రొఫెషనల్ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌ '2023 టాప్ కంపెనీస్ ఇండియా' పేరిట రూపొందించిన నివేదిక ద్వారా వెల్లడించింది. సంస్థ ప్రమాణాలు, నైపుణ్యాల పెరుగుదల, కంపెనీ స్థిరత్వం, బయటి అవకాశాలు, ఉద్యోగులకు కంపెనీతో అనుబంధం, లింగ వైవిధ్యం వంటి 8 అంశాల ఆధారంగా ఈ నివేదికను లింక్డిన్‌ రూపొందించింది.

  • దేశంలో అత్యుత్తమ పని వాతావరణం కలిసి సంస్థల్లో టీఎసీఎస్ అగ్రస్థానంలో నిలిచింది.
  • తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్​, మోర్గాన్ స్టాన్లీ సంస్థలు నిలిచాయి.
  • మెక్వేరీ గ్రూప్​(5), హెచ్​డీఎఫ్​​సీ బ్యాంక్​(11), మాస్టర్ కార్డ్(12), యూబీ(14)వ స్థానాల్లో నిలిచాయి.
  • లింక్డిన్‌ 'టాప్‌ స్టార్టప్‌ లిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' జాబితాలో జెప్టో 16వ స్థానంలో ఉంది.
  • ప్రముఖ గేమింగ్ యాప్స్.. డ్రీమ్ 11(20), గేమ్స్ 24x7(24) స్థానాల్లో నిలిచాయి.
  • లింక్డిన్ పొందుపరిచిన జాబితాలో ఉన్న సంస్థల్లో 17 కొత్తవి.
  • లింక్డిన్​ విడుదల చేసిన 25 వర్క్ ప్లేస్​ల జాబితాలో 10 కంపెనీలు ఆర్థిక సేవలు, బ్యాంకింగ్​, ఫిన్​టెక్ కంపెనీలే ఉన్నాయి.
  • లొకేషన్‌ల విషయానికొస్తే.. ఈ కంపెనీలు బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌, దిల్లీ, పుణె వంటి నగరాల్లో ప్రతిభావంతులైన అభ్యర్థులను నియమించుకుంటున్నాయి.

మెటా నుంచి ఉద్యోగుల తొలగింపు..
ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మరింత మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యయ నియంత్రణలో భాగంగా దాదాపు మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని మెటా నిర్ణయించినట్లు సమాచారం.

మెటా పరిధిలో ఉన్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వర్చువల్‌ రియాలిటీపై పనిచేస్తున్న రియాలిటీ ల్యాబ్‌.. ఇలా అన్ని వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మేనేజర్లకు అంతర్గతంగా మెటా సమాచారం పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చిలోనే సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ దీనిపై సంకేతాలిచ్చారు. అన్ని విభాగాల్లో సిబ్బంది కూర్పును పునఃసమీక్షించి కంపెనీ సామర్థ్యాన్ని మరింత పెంచాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తాజాగా లేఆఫ్‌లకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. మే నెలలో మరికొంత మందిని కూడా మెటా తీసివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Last Updated : Apr 19, 2023, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details