TCS Dress Code :దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) కంపెనీ సంస్థ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందిగా కొద్ది రోజుల క్రితం టీసీఎస్ ప్రకటించింది. ఆఫీసులకు వచ్చి పనిచేయడం వల్లే ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుందని.. బిజినెస్ చక్కగా జరుగుతుందని అభిప్రాయపడింది. ఇదే క్రమంలో తాజాగా మరో కీలక విషయం తెలిసింది. ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి వచ్చే క్రమంలో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్.. ఈ మేరకు ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్‌లో ఈ విషయం వెల్లడించారు. డ్రెస్ కోడ్ ప్రాముఖ్యం నొక్కి చెప్పారు. డ్రెస్ కోడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా తమ వాటాదారులపై మంచి ప్రభావం చూపిస్తుందని అన్నారు. 'మనం ఆఫీసులో ఉన్న సమయాల్లో బాధ్యతలు, ఇంకా విధుల్ని నిర్వర్తించే సమయంలో.. డ్రెస్ కోడ్ పాలసీ అనేది స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తుంది.' అని మిలింద్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా టీసీఎస్ కంపెనీలో గత రెండేళ్లలో చాలా మంది చేరారని.. వారు ఇంత వరకు ఆఫీసులకు రాలేదని చెప్పిన మిలింద్ లక్కడ్.. వారికి ఇప్పుడు టీసీఎస్ పద్ధతులు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీసీఎస్ మార్గంలో పయనించేలా చేయాలని చెప్పుకొచ్చారు.
ఇది డ్రెస్‌కోడ్..
TCS Employee Dress Code :
సోమవారం నుంచి గురువారం- బిజినెస్ క్యాజువల్స్ :
- మగవారు తప్పనిసరిగా ఫార్మల్ ప్యాంట్‌తో ఫుల్-స్లీవ్స్ ఉన్న ఫార్మల్ షర్ట్‌ను మాత్రమే ధరించాలి.
- మహిళా ఉద్యోగులు తప్పనిసరిగా ఫార్మల్ స్కర్టులు, చీరలు లేదా కుర్తాలను ధరించాలి.