Tata Waiting Period October 2023 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. తమ కస్టమర్లకు సరికొత్త కార్లను అందించడంలో కాస్త జాప్యం చేస్తోంది. కరోనా సంక్షోభం తరువాత టాటా కంపెనీకి చెందిన గ్లోబల్ సప్లై చెయిన్ బాగా దెబ్బతింది. దీనితో సకాలంలో కస్టమర్లకు కార్లను అందించడం కాస్త కష్టంగా మారింది. అయితే టాటా మోటార్స్ మాత్రం డిమాండ్‌కు తగిన విధంగా తమ కార్ల ఉత్పత్తిని పెంచడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
వెయిట్ చేయాల్సిందే!
ప్రస్తుతం దేశంలో కార్లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ సరికొత్త కార్లను ఎప్పటికప్పుడు.. కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే నమ్మకానికి, క్వాలిటీకి పెట్టింది పేరైన టాటా మోటార్స్ మాత్రం.. వినియోగదారులకు తమ కార్లను అందించడంలో కాస్త జాప్యం చేస్తోంది. సప్లై చెయిన్ దెబ్బతినడమే ఇందుకు కారణమని చెప్పకతప్పదు.
వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే?
Tata Nexon : టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన టాటా నెక్సాన్.. డెలివరీ కావాలంటే కనీసం 6-8 వారాలు పడుతుంది. అయితే నెక్సాన్ కారు వేరియంట్, కలర్ ఛాయిస్‌ను అనుసరించి ఈ వెయిటింగ్ పీరియడ్ మారుతుంది.
Tata Punch CNG : టాటా పంచ్ సీఎన్జీని ఎవరైనా బుక్ చేసుకుంటే.. కారు డెలివరీ కావడానికి కనీసం 12 వారాల సమయం పడుతోంది. టాటా పోర్టిఫోలియోలో అత్యంత ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న కారు ఇదే.
S.No | టాటా కార్ మోడల్ | వెయిటింగ్ పీరియడ్ |
1 | నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ | 6-8 వారాలు |
2 | పంచ్ పెట్రోల్ | గరిష్ఠంగా 4 వారాలు |
3 | పంచ్ సీఎన్జీ | 12 వారాలు |
4 | ఆల్ట్రోజ్ సీఎన్జీ | గరిష్ఠంగా 4 వారాలు |
5 | ఆల్ట్రోజ్ డీజిల్ | గరిష్ఠంగా 6 వారాలు |
6 | టియాగో పెట్రోల్ | గరిష్ఠంగా 4 వారాలు |
7 | టియాగో సీఎన్జీ | గరిష్ఠంగా 8 వారాలు |
8 | హారియర్ (ప్రీ-ఫేస్‌లిఫ్ట్) | 4-6 వారాలు |
9 | సఫారీ (ప్రీ-ఫేస్‌లిఫ్ట్) | 4-6 వారాలు |