తెలంగాణ

telangana

ETV Bharat / business

Tata Upcoming Cars In India : అదిరే ఫీచర్లతో.. 500 కి.మీ రేంజ్​తో.. రానున్న టాటా 'ఈవీ' కార్స్ ఇవే! - అప్​కమింగ్​ టాటా కార్స్​ 2023

Tata Upcoming Cars In India : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన టాటా మోటార్స్.. మూడు సరికొత్త ఈవీ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే వీటిని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Upcoming Tata Cars In India
Tata Upcoming Cars

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 4:22 PM IST

Tata Upcoming Cars In India :పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్యం కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగానే కంపెనీలు సైతం ఎలక్ట్రిక్​ వాహనాలను అదే స్థాయిలో తయారు చేస్తున్నాయి. టాటా కంపెనీ కూడా మరిన్ని ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ కార్ల తయారీపై దృష్టి సారించింది. అందులో భాగంగా త్వరలోనే 3 సరికొత్త ఈవీ కార్లను మార్కెట్​లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా పంచ్​ ఈవీ..

టాటా పంచ్​ ఈవీ
Tata Punch EV : టాటా పంచ్ ఈవీ కారును2024 సంవత్సరం ప్రారంభంలోనే మార్కెట్​లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో రెండు బ్యాటరీలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో వివిధ రకాల అధునాతన ఫీచర్లను కూడా పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది.

టాటా కర్వ్ ఈవీ

టాటా కర్వ్​ ఈవీ
Tata Curvv EV : టాటా కర్వ్​ ఈవీ కారును 2024లో మార్కెట్​లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మోడల్​ కారులో రెండు ఛార్జింగ్​ బ్యాటరీలను ఏర్పాటు చేస్తోంది టాటా కంపెనీ. ఈ కారును ఒక్కసారి ఫుల్​ఛార్జ్​ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ కారులో అనేక అధునాతన ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది.

టాటా హారియర్ ఈవీ..

టాటా హారియర్ ఈవీ
Tata Harrier EV : టాటా హారియర్​ ఈవీ కారును కూడా 2024లోనే మార్కెట్​లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది టాటా కంపెనీ. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 400 నుంచి 500 కిలోమీటర్లు ప్రయణించవచ్చని సమాచారం. అయితే ఈ కారు ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

పండగకు కొత్త కారు కొనాలా?.. మహీంద్రా కార్లపై రూ.1.25 లక్షల డిస్కౌంట్​.. ఉచిత యాక్సెసరీస్​ కూడా..
Mahindra Car Discounts In October 2023 :భారత్​కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ మహీంద్రా.. తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్​లను ప్రకటించింది. వివిధ మోడళ్లపై దాదాపు రూ.1.25లక్షల వరకు డిస్కౌంట్​ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2023 అక్టోబర్​లో మాత్రమే ఈ ఆఫర్​ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. మహీంద్రా XUV300, మహీంద్రా XUV400, మహీంద్రా మరాజ్జో, మహీంద్రా బొలెరో, మహీంద్రా బొలెరో నియో.. వాహనాలపై ఈ ఆఫర్స్​​ అందిస్తున్నట్లు మహీంద్రా పేర్కొంది. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

2023 Hero Glamour 125 Price : స్టైలిష్ లుక్స్​తో హీరో గ్లామర్ 2023.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ..!

Bajaj Pulsar NS400 Features and Pricing : పల్సర్ NS400 సూపర్ బైక్.. స్టన్నింగ్ ఫీచర్స్, ధర ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details