తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా టెక్ IPOలో ఇన్వెస్ట్ చేయాలా? ఈ 10 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Tata Technologies IPO In Telugu : టాటా టెక్నాలజీస్​ ఐపీఓ నవంబర్​ 22న ప్రారంభం కానుంది. ఇది టాటా గ్రూప్​ నుంచి దాదాపు 20 ఏళ్ల తర్వాత వస్తున్న ఐపీఓ కావడం విశేషం. ఈ ఐపీఓ పూర్తి వివరాలు మీ కోసం.

Tata Tech IPO
Tata Technologies IPO

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 3:31 PM IST

Tata Technologies IPO : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) నవంబర్ 22న ప్రారంభం కానుంది. వాస్తవానికి ఇది టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అనే విషయం అందిరికీ తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓ ఇదే కావడం విశేషం.

ఆఫర్ ఫర్ సేల్​
వాస్తవానికి ఈ ఇష్యూ ప్రమోటర్స్​​, ఇన్వెస్టర్స్ ద్వారా వస్తున్న ఆఫర్​ ఫర్​ సేల్​ (OFS) మాత్రమే అని గుర్తించుకోవాలి. టాటా టెక్నాలజీస్..​ ఈ ఐపీఓ ద్వారా అప్పర్ ప్రైస్ బ్రాండ్​పై రూ.3,042.51 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.

ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ టాటా టెక్నాలజీస్​ ఐపీఓలో పాల్గొనాలని భావిస్తున్న పెట్టుబడిదారులు కచ్చితంగా ఈ క్రింద తెలిపిన 10 విషయాలు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే..

1. ఐపీఓ తేదీలు :

  • టాటా టెక్నాలజీస్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం : 2023 నవంబర్​ 22
  • ఐపీఓ సబ్​స్క్రిప్షన్​కు చివరి తేదీ : 2023 నవంబర్​ 24

నోట్​ :యాంకర్ ఇన్వెస్టర్ల కోసం నవంబర్ 21నే ఇష్యూ ప్రారంభం కానుంది.

2. ధరల శ్రేణి (Price Band) : ఈ ఐపీఓలో ప్రైస్ బ్యాండ్ రూ.475- రూ.500 మధ్య నిర్ణయించారు. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద కంపెనీ విలువ రూ.20,283 కోట్లుగా ఉంది.

3. ఐపీఓ వివరాలు :టాటా టెక్నాలజీస్​ ఈ ఐపీఓ ద్వారా రూ.3,042.51 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇక్కడ ఇన్వెస్టర్లు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ఇష్యూ ప్రమోటర్స్​​, ఇన్వెస్టర్స్ ద్వారా వస్తున్న ఆఫర్​ ఫర్​ సేల్​ (OFS) మాత్రమే.

  • ఈ ఇష్యూ ద్వారా టాటా మోటర్స్ రూ.2,314 కోట్లు విలువైన 4.62 కోట్ల ఈక్వీటీ షేర్లు;
  • ఇన్వెస్టర్ ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.486 కోట్లు విలువైన 87.17 లక్షల షేర్లు;
  • టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ రూ.243 కోట్లు విలువైన 49 లక్షల షేర్లు జారీ చేస్తున్నాయి.
  • టాటా మోటార్స్ కంపెనీ తమ ఉద్యోగుల కోసం 20.28 లక్షల షేర్లు, కంపెనీ షేర్ హోల్డర్స్ కోసం 60.85 లక్షల షేర్లను రిజర్వ్ చేసింది.

4. ఇష్యూ లక్ష్యం : ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కనుక.. టాటా టెక్నాలజీస్ కంపెనీ​ ఈ ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బును.. పూర్తిగా తమ వాటాదారులకు అందిస్తుంది.

5. లాట్ సైజ్ : ఈ ఐపీఓలో ఒక్కో లాట్‌లో 30 చొప్పున ఈక్విటీ షేర్లు ఉంటాయి. లోవర్ ప్రైస్​ బ్యాండ్​తో కొనుగోలు చేయాలంటే కనీస పెట్టుబడి రూ.14,250గా ఉంటుంది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద కొనుగోలు చేయాలంటే రూ.15,000 అవుతుంది.

6. కంపెనీ ప్రొఫైల్ : ఈ టాటా టెక్నాలజీస్ ఒక గ్లోబల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ కంపెనీ. ఇది ప్రొడక్ట్ డెవలప్మెంట్​ సహా డిజిటల్ సొల్యూషన్స్​, టర్న్​కీ సొల్యూషన్స్​ అందిస్తుంది. వాస్తవానికి టాటా టెక్నాలజీస్ అనేది ఒక ప్యూర్-ప్లే మాన్యుఫాక్చురింగ్​ ఫోకస్డ్​ ఇంజినీరింగ్​, రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ కంపెనీ. ప్రధానంగా ఇది ఆటోమోటివ్ ఇండస్ట్రీపై దృష్టి కేంద్రీకరిస్తుంది. అయితే టాటా టెక్నాలజీస్ అనేది Phygital ఎడ్యుకేషన్​ సొల్యూషన్స్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్​ సంస్థలకు కావాల్సిన అప్​స్కిల్లింగ్​, రీస్కిల్లింగ్​, మాన్యుఫాక్చురింగ్ నైపుణ్యాలను కూడా అందిస్తుంది.

7. ఫైనాన్షియల్స్ : మార్చి 2023 నాటికి కంపెనీ నెట్ ప్రాఫిట్​ 42.8 శాతం పెరిగి రూ.624 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో కంపెనీ రెవెన్యూ కూడా 25 శాతం పెరిగి రూ.4,414.2 కోట్లుకు చేరుకుంది. అంతేకాదు గత 6 నెలల కాలంలో కంపెనీ ప్రాఫిట్ 36 శాతం పెరిగి రూ.351.9 కోట్లుకు చేరుకుంది. రెవెన్యూ కూడా 34 శాతం పెరిగి రూ.2,526.7 కోట్లుకు చేరుకుంది.

8. లీడ్ మేనేజర్స్ : ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్​ లీడ్ మేనేజర్లుగా.. జేఎం ఫైనాన్షియల్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, బోఫా సెక్యూరిటీస్ ఇండియా ఉన్నాయి. లింక్ ఇన్‌టైమ్ ఇండియా రిజిస్ట్రార్​గా ఉంది.

9. లిస్టింగ్ తేదీ : ఐపీఓ షెడ్యూల్​ ప్రకారం, డిసెంబర్​ 5న టాటా టెక్నాలజీస్​ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

10. రిస్క్ అండ్ రివార్డ్​ :

  • టాటా టెక్నాలజీస్​లో TML, JLR కంపెనీలు దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది ఆదాయ కేంద్రీకరణ ప్రమాదాన్ని సూచిస్తోంది.
  • ప్రధానంగా ఈ కంపెనీకి వచ్చే ఆదాయం అంతా ఆటోమోటివ్ విభాగంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది.
  • టాటా టెక్నాలజీస్​.. భవిష్యత్​లో కొత్త ఎనర్జీ వెహికల్​ కంపెనీల నుంచి భారీ స్థాయిలో ఆదాయం వస్తుందని ఆశిస్తోంది. కానీ అది ఎంత వరకు సాధ్యపడుతుంది అనేది ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి.
  • గతంలో ఈ కంపెనీ చాలా నష్టాలను చవిచూసింది. సమీప భవిష్యత్​లోనూ ఈ నెగిటివ్ క్యాష్ ఫ్లో కొనసాగే అవకాశం ఉంది. కనుక ఇది కంపెనీ కార్యకలాపాలతో సహా, లిక్విడిటీని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే టాటా గ్రూప్​నకు ఉన్న క్రెడిబిలిటీ, నష్టాలను భరించగలిగే సామర్థ్యం ప్లస్ పాయింట్స్​గా మనం చెప్పుకోవచ్చు.

టీసీఎస్ షేర్స్ బైబ్యాక్​
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (TCS) రూ.17,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్​ రికార్డ్ తేదీని ప్రకటించింది. అక్టోబర్ 11న బైబ్యాక్ ప్రకటించిన టీసీఎస్..​ ఈ నవంబర్​ 5న షేర్లను​ బైబ్యాక్ చేస్తున్నట్లు స్టాక్​ ఎక్స్ఛేంజ్​ ఫైలింగ్​లో పేర్కొంది. ముఖ్యంగా 4,09,63,855 ఈక్విటీ షేర్లను.. ఒక్కో షేరుకు రూ.4,150 చొప్పున చెల్లించి, తిరిగి కొనుగోలు చేయాలని భావిస్తోంది.

ఇకపై ప్రతి కారులోనూ ADAS మస్ట్​ - కేంద్రం కొత్త రూల్​ - మరి ధరలు పెరుగుతాయా?

ఇన్సూరెన్స్ కవరేజ్​ Vs టాక్స్ సేవింగ్​ - ఏది బెటర్​ ఛాయిస్​?

ABOUT THE AUTHOR

...view details