TATA Punch CNG Sunroof Specs leak : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. పంచ్ సీఎన్జీని త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే లాంఛ్‌కు ముందే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కారు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.
పోటీకి సిద్ధం!
TATA Punch Rivals : టాటా మోటార్స్ ఇప్పుడు 'పంచ్ సీఎన్జీ'ని.. సన్‌రూఫ్ వేరియంట్‌తో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టమైంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సిట్రోయెన్, హ్యుందాయ్‌లకు పోటీగా దీనిని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి టాటా మోటార్స్.. అకాంప్లిష్ డాజిల్ ట్రిమ్ సహా దానిపైన ఉన్న అన్ని వేరియంట్లలో సన్‌రూఫ్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది.
ఛాయిస్ మనదే!
TATA Punch CNG Variants : టాటా పంచ్ పెట్రోల్ కారు ఎంచుకున్నా లేదా పెట్రోల్+సీఎన్జీ వెర్షన్ ఎంచుకున్నా.. వాటిలో సన్‌రూఫ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్టర్ కారు మాత్రమే సన్‌రూఫ్‌ను అందిస్తున్న ఏకైక పోటీదారుగా ఉంది. కానీ టాటా పంచ్ రాకతో దానికి గట్టి పోటీ ఎదురుకానుంది.
స్పెక్స్ లీక్
TATA Punch CNG Specifications : లీక్ అయిన టాటా పంచ్ సీఎన్జీ స్పెసిఫికేషన్స్ ఏమిటంటే.. టాటా పంచ్‌లో అల్ట్రోజ్ కారు మాదిరిగానే ట్విన్ సిలిండర్ లేఅవుట్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ కారులో సీఎన్జీ కిట్‌తో సహా.. 1.2లీటర్ ఎన్ఏ 3 సిలిండర్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఇది పెట్రోల్‌తో నడిచేటప్పుడు 87బీపీహెచ్ పవర్, 115 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇదే ఇంజిన్ సీఎన్జీతో నడిచేటప్పుడు 72 బీపీహెచ్ పవర్, 102 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. టాటా పంచ్ కారులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇది మంచి ట్రాన్స్మిషన్ విధులను నిర్వహిస్తుంది.
టాటా పంచ్ సీఎన్జీ కారు సన్‌రూఫ్ వేరియంట్ లీకైన సమాచారం ప్రకారం
TATA Punch CNG Specs : టాటా మోటార్స్.. ప్యూర్ రిథమ్ ట్రిమ్, ప్యూర్, అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ డాజిల్ మినహా.. మిగతా అన్ని పంచ్ వేరియంట్లలో సీఎన్జీని అందించాలని చూస్తోంది. కానీ టాటా పంచ్ కామో ఎడిషన్‌తో మాత్రం సీఎన్జీని అందించదు.
టాటా పంచ్ ధర
TATA Punch CNG With Sunroof Price : టాటా మోటార్స్ .. ఈ పంచ్ సీఎన్జీ వేరియంట్ కారు ధరను రూ.10.3 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సన్‌రూఫ్ కావాలనుకుంటే అదనంగా రూ.45,000 చెల్లించాల్సి ఉంటుంది. టాటా పంచ్ అనేది మార్కెట్లోకి విడుదల అయితే.. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
టాటా పంచ్ స్పెక్స్ అండ్ ఫీచర్స్
TATA Punch CNG Features : టాటా పంచ్‌లో రెండు సీఎన్జీ సిలిండర్లు ఉన్నాయి. అలాగే మంచి బూట్ స్పేస్ కూడా ఉంది. దీనిలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీట్, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. భద్రత ప్రమాణాల విషయానికి వస్తే టాటా పంచ్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. ప్రొజెక్టర్ హెచ్ ల్యాంప్ ఉన్న ఈ కారు 16 అంగుళాల ఆలాయ్ వీల్స్‌పై నడుస్తుంది.