తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లోకి 'టాటా నెక్సాన్ మ్యాక్స్' ఈవీ​.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 437 కి.మీ జర్నీ - టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధర

TATA Nexon EV Max: నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేసింది టాటా. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 437 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది. అధునాతన ఫీచర్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఈ వాహనం.. వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపింది.

TATA Nexon EV Max
టాటా నెక్సాన్ మ్యాక్స్ ఈవీ

By

Published : May 11, 2022, 2:23 PM IST

TATA Nexon EV Max: వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నెక్సాన్ ఈవీ మ్యాక్స్​ మోడల్​ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది టాటా. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ విద్యుత్ వాహనం ప్రారంభ ధర(ఎక్స్​షోరూం) రూ.17.74లక్షలు. దీన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 430కి పైగా కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది. మరి దీని ఫీచర్లు, ప్రత్యేకలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టాటా నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​
  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెక్సాన్​ ఈవీకి మరిన్ని ఫీచర్లు జతచేసి నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​ను రూపొందించింది టాటా. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 437 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. నెక్సాన్ ఈవీ కంటే ఇది 125 కిలోమీటర్లు అధికం కావడం గమనార్హం.
  • నెక్సాన్ ఈవీ మ్యాక్స్​ 40.5kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. రెగ్యులర్ నెక్సాన్​ ఈవీలో ఇది 30.2kWhకే పరిమితమైంది.
  • ఈ సరికొత్త ఈవీలో బ్యాటరీతోపాటు పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్​ మోటర్​ను కూడా అప్డేట్ చేశారు. 141 హెచ్​పీ 250Nm సామర్థ్యంతో అధునాతన నెక్సాన్ ఈవీ మ్యాక్స్​ను తీర్చిదిద్దారు.
    టాటా నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​
  • ఈ విద్యుత్​ వాహనంలో 3.3kWh ఆన్​ బోర్డ్​ పోర్టబుల్ ఛార్జర్​ ఉంటుంది. అయితే మరో రూ.50వేలు అదనంగా చెల్లిస్తే 7.2kWh ఏసీ ఫాస్ట్ ఛార్జర్​ పొందవచ్చు.
  • నెక్సాన్ ఈవీ మ్యాక్స్​ సాధారణ రెగ్యుల్​ ఛార్జర్​తో ఛార్జ్​ చేస్తే బ్యాటరీ ఫుల్ కావడానికి 16 గంటలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్​తో అయితే ఆరున్నర గంటలు పడుతుంది. కానీ 50kWh ఛార్జర్​తో ఛార్జ్ చేస్తే మాత్రం 56 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది.
  • నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​ ను XZ+, XZ+ Lux అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. సిగ్నేచర్ ఇంటన్సి టీల్​, డయాటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్​ వంటి కొత్త రంగుల్లో తీసుకొచ్చారు.
  • అన్ని వీల్స్​కు డిస్క్ బ్రేక్​లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్​ బ్రేక్ విత్ ఆటో హోల్డ్​, వైర్​లెస్ స్మార్ట్​ఫోన్ ఛార్జర్​, ఇల్యుమినేటెడ్ డ్రైవ్​ మోడ్​ సెలక్టర్​ నాబ్​ వంటి ప్రత్యేక ఫీచర్లున్నాయి.
  • ఎయిర్​ ప్యూరిఫయర్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, సరికొత్త ఇంటీరియర్​, ఫ్రంట్ సీట్లకు వెంటిలేటర్ సదుపాయం, ఆటో డిమ్మింగ్​ ఐఆర్​వీఎం వంటి ఇతర సదుపాయాలున్నాయి.
  • టాటా నెక్సాన్​ ఈవీ XZ+ ప్రారంభ ధరూ రూ.17.74లక్షలు. XZ+ Lux ప్రారంభ ధర రూ.19.24లక్షలు.
    టాటా నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​

ABOUT THE AUTHOR

...view details