Tata Motors prices hike: ప్రముఖ దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన ధరలను పెంచింది. మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు గరిష్ఠంగా 1.1 శాతం వరకు ఉన్నట్లు వెల్లడించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
వినియోగదారులకు షాక్.. ఆ కార్ల ధరలు మరింత ప్రియం - టాటా మోటార్స్ రేట్లు పెరుగుదల
Tata Motors prices hike: ప్రయాణికుల వాహన ధరలను మరోసారి పెంచింది టాటా మోటార్స్. నిర్వహణ వ్యయాలు, ముడిపదార్థాల ధరల పెరుగుదల వల్ల ఈ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పడంలేదని పేర్కొంది.

టాటా మోటార్స్
నిర్వహణ వ్యయాలు, ముడిపదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పడం లేదని పేర్కొంది. ఇటీవల మారుతీ సుజుకీ, బీఎండబ్ల్యూ సహా పలు వాహన సంస్థలు ధరలు పెంచాయి. సెమీకండక్టర్ల కొరతతో పాటు పలు కీలక లోహాలు అందుబాటులో లేకపోవడం వాహన పరిశ్రమకు గతకొన్ని రోజులుగా సవాల్ విసురుతున్నాయి.
ఇదీ చదవండి:విక్రయానికి రూ.70,000 కోట్లు విలువ చేసే షేర్లు.. కొనేదెవరు?