Sukanya Samriddhi Yojana : తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బంగారుమయంగా ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్ చదువు కోసం, పెళ్లి కోసం పొదుపు చేయాలని అనుకుంటారు. ఇందుకోసం సరైన పథకాల్లో పెట్టుబడి పెట్టాలని ఆశిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది.
ఇద్దరికి మాత్రమే!
Sukanya Samriddhi Yojana Account : సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ నిబంధనల ప్రకారం, తల్లిదండ్రులు తమ కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లల పేరు మీద రెండు వేర్వేరు అకౌంట్స్‌ను ఓపెన్ చేయగలరు. అయితే ఆ బాలికల వయస్సు 10 ఏళ్ల లోపు ఉండాలి. ఒక వేళ వాళ్లకు మూడో అమ్మాయి ఉన్నా కూడా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద మూడో ఖాతా తెరవలేరు.
ప్రత్యేక పరిస్థితుల్లో
Sukanya Samriddhi Yojana Deposit Rules : సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఒక ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. తల్లిదండ్రులకు ఇద్దరు కంటే ఎక్కువ మంది కవల ఆడ పిల్లలు పుడితే, అప్పడు మాత్రం మూడు కంటే ఎక్కువ ఖాతాలు తెరవడానికి వీలు కల్పిస్తారు.
వడ్డీరేటు ఎంత?
Sukanya Samriddhi Yojana Interest Rate 2023 : సుకన్య సమృద్ధి యోజన పథకంలో.. ఖాతా తెరచినప్పటి నుంచి 15 ఏళ్లు వరకు అమ్మాయి పేరుమీద మదుపు చేయవచ్చు. ఈ స్కీమ్‌లో ఒక సంవత్సరానికి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు వరకు మదుపు చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ పథకంలోని డిపాజిట్లపై 8 శాతం వరకు వడ్డీ రేటు ఇస్తున్నారు.
మెచ్యూరిటీ అమౌంట్!
Sukanya Samriddhi Yojana Maturity : సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మదుపు చేయవచ్చు. ఈ విధంగా 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే.. 8 శాతం చొప్పున వడ్డీ లెక్క వేసినా.. కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల రూ.67.3 లక్షల వరకు మెచ్యూరిటీ అమౌంట్ చేతికి అందుతుంది.