తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆదివాసీ తెగల ఘర్షణల్లో 168 మంది మృతి - Sudan news today

Sudan Clashes: సుడాన్​లో అరబ్బులు, అరబ్బుయేతర వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 168 మంది మరణించారు. మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Sudan Clashes
ఆదివాసీ తెగల ఘర్షణల్లో 168 మంది మృతి

By

Published : Apr 25, 2022, 10:29 AM IST

Updated : Apr 25, 2022, 10:46 AM IST

Sudan Clashes: సుడాన్ దార్​ఫూర్ ప్రాంతంలో ఆదివారం తీవ్ర హింస చెలరేగింది. అరబ్బులు, అరబ్బుయేతర ఆదివాసీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 168 మంది మరణించారు. మరో 98మంది తీవ్రంగా గాయపడ్డారు. దార్​ఫూర్​లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ఓ సంస్థ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం పశ్చిమ దార్​ఫూర్​లోని క్రీనిక్​లో దుండగులు ఇద్దరిని హత్య చేశారని, ఆ తర్వాత ఈ ప్రాంతంలో హింస ఉగ్రరూపం దాల్చిందని వివరించారు. ​జాన్​జావీద్​ అనే మిలీషియాలు ఆదివారం క్రీనిక్​లో ఆయుధాలతో దాడి చేసి ఇళ్లను లూటీ చేశారని, ఆ తర్వాత వాటిని తగలబెట్టారని పేర్కొన్నారు.

Sudan tribal clashes: క్రీనిక్​ తర్వాత ఘర్షణలు జెనీనాకు వ్యాపించాయి. మిలీషియా సాయుధులు నగరంలో ఓ ఆస్పత్రిపై దాడి చేశారు. గాయాలతో అప్పటికే అక్కడ చికిత్స పొందుతున్న వారిపై కాల్పులు జరిపారు. గురువారం మొదలైన హింసలో 8 మంది చనిపోయి, 16మంది గాయపడ్డ తర్వాత అధికారులు భారీగా బలగాలను మోహరించారు. అయినప్పటికీ హింసను ఆపలేకపోయారు. దార్​ఫూర్​ ప్రాంతంలో కొన్ని ఆదివాసీ వర్గాలకు అస్సలు పడదు. అందుకే ఇక్కడ గత కొన్ని నెలలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. 110 మంది దుర్మరణం

Last Updated : Apr 25, 2022, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details