తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల్లో దేశీయ మార్కెట్లు.. సెన్సెక్స్​ 500 ప్లస్​

Stock Markets Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 545 పాయింట్లు, నిఫ్టీ 181 పాయింట్లు లాభపడ్డాయి.

Stock Markets Closing
Stock Markets Closing

By

Published : Aug 1, 2022, 3:58 PM IST

Stock Markets Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, రిలయన్స్, టాటా మోటార్స్, మహీంద్ర షేర్ల కొనుగోలుకు మదుపరులు ఆసక్తి చూపడం వల్ల సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం 57,782 వద్ద ప్రారంభమైన బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్.. ఒక దశలో 57,554 కనిష్ఠానికి చేరుకుంది. చివరకు 545 పాయింట్లు పెరిగి 58,115 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 17,243 వద్ద ప్రారంభమై.. 17,167 కనిష్ఠానికి చేరుకుంది. 181 పాయింట్ల లాభంతో 17,340 వద్ద సెషన్​ను ముగించింది.

లాభనష్టాల్లో ఇవే..: మహీంద్ర అండ్​ మహీంద్ర, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్​జీసీ​, సిప్లా షేర్లు​ లాభాల్లో ముగిశాయి. సన్​ ఫార్మా, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, బ్రిటానియా, దివిస్​ షేర్లు నష్టపోయాయి.
బలపడిన రూపాయి: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే.. 23 పైసలు లాభపడి రూ. 79.01 వద్ద స్థిరపడింది.

ABOUT THE AUTHOR

...view details