తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లలో ఫుల్​ జోష్​.. సెన్సెక్స్​ 600 ప్లస్​.. '80' వద్ద రూపాయి - స్టాక్​ మార్కెట్లు క్లోజ్​

Stock Markets Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 629 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు లాభపడ్డాయి.

stocks-closing-today-and-rupee-value
stocks-closing-today-and-rupee-value

By

Published : Jul 20, 2022, 3:48 PM IST

Stock Markets Closing: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల పరంపర కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో బుధవారం కూడా భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 629 పాయింట్లు పెరిగి 55 వేల 397 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 180 పాయింట్ల లాభంతో 16 వేల 520 వద్ద సెషన్​ను ముగించింది.

లాభనష్టాల్లో ఇవే..
టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, రిలయన్స్​, ఎస్​బీఐఎన్​, ఇన్ఫీ, విప్రో, టైటాన్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెడ్​ఎఫ్​సీ, ఐటీసీ, టాటాస్టీల్​ లాభాలతో రాణించాయి. ఎన్టీపీసీ, కొటాక్​ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​, సన్​ఫార్మా షేర్లు నష్టపోయాయి.

రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే.. 8 పైసలు నష్టపోయి రూ.80 వద్ద స్థిరపడింది. మంగళవారం.. 6 పైసలు క్షీణించి 79.92 వద్ద ముగిసింది.

ఇవీ చదవండి:రెస్టారెంట్స్​లో సర్వీస్ ఛార్జ్​ కేసులో ట్విస్ట్.. బ్యాన్​పై దిల్లీ హైకోర్టు స్టే

'ప్రస్తుతం ట్రేడింగ్​లో లాభాలు కష్టమే.. ఆ వ్యూహం పాటించండి'

ABOUT THE AUTHOR

...view details