తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా భయాల నడుమ ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు

Stock markets start with little profit
స్వల్ప లాభాలతో స్టాక్​ మార్కెట్లు ప్రారంభం

By

Published : Apr 20, 2020, 10:02 AM IST

Updated : Apr 20, 2020, 5:07 PM IST

17:02 April 20

దేశీయ మార్కెట్లు సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతోనూ, నిఫ్టీ ఫ్లాట్‌గానూ ముగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్‌ అనంతరం ఒడుదొడుకులకు లోనై చివరికి 59.28 పాయింట్లు లాభపడి 31,648 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 4.90 పాయింట్లు నష్టపోయి 9,261.85 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, కొవిడ్‌-19 కారణంగా మదుపరులు ఆచితూచి వ్యవహరించారు.

లాభనష్టాల్లో....

నిఫ్టీలో టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

రంగాల వారీగా చూస్తే ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎనర్జీ షేర్లకు కొనుగోలు మద్దతు లభించగా.. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ షేర్లు అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. త్రైమాసిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేర్లు మూడు శాతం మేర లాభపడడం గమనార్హం.

రూపాయి...

డాలరుతో రూపాయి మారకం విలువ 76.53గా ఉంది.

15:42 April 20

ఫ్లాట్​గా ముగింపు...

ఆర్​బీఐ ఉద్దీపన చర్యల కన్నా కరోనా భయాలే మార్కెట్లపై అధిక ప్రభావం చూపాయి. దేశీయ స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 31,648 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 4.90 పాయింట్లు క్షీణించి.. 9,261 వద్ద ముగిసింది.

09:25 April 20

ఫ్లాట్​గా...

స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో పయనిస్తున్నాయి. ఆర్​బీఐ రూ.లక్ష కోట్ల ఉద్దీపన చర్యలు ప్రకటించినప్పటికీ మదుపరులను కరోనా భయాలు వెంటాడుతున్నాయి.  మొదట స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్​, నిఫ్టీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి వెళ్లాయి.

ప్రస్తుతం సెన్సెక్స్​ 18 పాయింట్ల నష్టంతో 31,570 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయి 9,262 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Apr 20, 2020, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details