సెన్సెక్స్ 365 పాయింట్లు డౌన్: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, కీలక సంస్థల ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 365 పాయింట్ల నష్టంతో 54,470.67 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 16,301.85 వద్ద ముగిసింది.
మరోవైపు, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 57 పైసలు పతనమైంది. ప్రస్తుతం 77.47 వద్ద స్థిరపడింది. ఇది జీవిత కాల కనిష్ఠస్థాయి కావడం గమనార్హం.