Stock Markets Closing: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 760 పాయింట్లు పెరిగి 54 వేల 521 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 229 పాయింట్ల లాభంతో 16 వేల 278 వద్ద సెషన్‌ను ముగించింది.
లాభనష్టాల్లో ఇవే..ఇండస్ఇండ్, ఇన్ఫీ, టెక్ మహీంద్రా, బజాబ్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, టాటా స్టీల్, సన్‌ఫార్మా రాణించాయి. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో దాదాపు అన్నీ లాభాల్లోనే ముగిశాయి. ఎన్టీపీసీ, హెడ్ఎఫ్సీ, మారుతీ, డా.రెడ్డి డీలాపడ్డాయి.