Stock Markets Close: వరుసగా రెండు రోజులు పతనమైన స్టాక్‌మార్కెట్లు గురువారం తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి పెద్ద సంస్థలు రాణించటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 437 పాయింట్లు ఎగబాకి 55,818 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 16,628 వద్ద స్థిరపడింది.
మార్కెట్లకు లాభాలు.. సెన్సెక్స్ 437 ప్లస్
Stock Markets Close: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలతో సెన్సెక్స్ 437, నిఫ్టీ 105 పాయింట్లకుపైగా లాభపడ్డాయి.
లాభనష్టాల్లోనివి: రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్‌లు లాభాపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, హీరో మోటర్‌కార్ప్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ, పవర్‌గ్రిడ్ సంస్థలు నష్టపోయాయి. జీఎస్టీ కలెక్షన్లు భారీగా రావడం, చమురు ధరలు తగ్గించడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. ఆసియా మార్కెట్లు టోక్యో, హాంగాంక్ నష్టపోగా.. చైనా షాంఘై మార్కెట్ లాభాలతో ముగిసింది.
ఇదీ చదవండి:భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా?