Stock Market today: అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ లాభాల్లో దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 712 పాయింట్లు పెరిగి 57,570 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ ఉదయం 17,079.50 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 17,170కు చేరిన సూచీ.. చివరకు 229 పాయింట్లు ఎగబాకి 17,158కి చేరింది.
లాభనష్టాల్లోనివి: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, హిందాల్కో, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు లాభపడగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కొటాక్ మహీంద్ర, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్స్, యాక్సిక్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.