తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market Today : షేర్​ ​మార్కెట్​ నయా రికార్డ్​.. బీఎస్​ఈ సెన్సెక్​ @65,000 - nifty all time high

Share Market Today : సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ ఆల్​టైమ్​ హై లెవల్​ 65,000 పాయింట్లు మార్కును దాటింది. నిఫ్టీ కూడా 19,318 లైఫ్​టైమ్​ హై రికార్డును సాధించింది.

share market today
stock market today

By

Published : Jul 3, 2023, 11:34 AM IST

Updated : Jul 3, 2023, 12:01 PM IST

Stock Market Today : సోమవారం దేశీయ స్టాక్​మార్కెట్లు సరికొత్త రికార్డ్​ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ మొదటిసారిగా 65,000 పాయింట్లు మార్కు దాటగా, ఎన్​ఎస్​ఈ కూడా ఆల్​టైమ్​ హై రికార్డు 19,318 పాయింట్లు నమోదు చేసింది. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం సహా అంతర్జాతీయ మార్కెట్లు కూడా బుల్లిష్​ ట్రెండ్​లో కొనసాగుతుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 458 పాయింట్లు లాభపడి 65,176 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 126 పాయింట్లు వృద్ధి చెంది 19,315 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, టాటాస్టీల్​, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ బ్యాంకు, రిలయన్స్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు :పవర్​గ్రిడ్​, మారుతి సుజుకి, యాక్సిస్​ బ్యాంకు, సన్​ఫార్మా, టైటాన్​, ఇన్ఫోసిస్​

అంతర్జాతీయ మార్కెట్లు
Global Market Trends : శుక్రవారం యూఎస్​ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. సోమవారం సియోల్​, టోక్యో, షాంగై, హాంగ్​కాంగ్​ మొదలైన ఆసియా మార్కెట్లు కూడా మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవన్నీ కూడా ఇండియన్​ స్టాక్​ మార్కెట్​పై సానుకూల ప్రభావాన్ని చూపించాయి.

విదేశీ పెట్టుబడుల వెల్లువ
FIIs investment in India : భారతదేశంలోని విదేశీ పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.6,397.13 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్​ డేటా స్పష్టం చేస్తోంది. అదే విధంగా జూన్ నెలలో రూ.47,148 కోట్ల మేర ఇండియాలో ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్ట్​మెంట్స్​ జరిగాయి.

జీఎస్​టీ కలెక్షన్లు
GST Collections in June 2023 : దేశంలో పరోక్ష పన్నుల విధానమైన జీఎస్టీ ప్రారంభించిన తరువాత టాక్స్​ కలెక్షన్లు బాగా ఊపందుకున్నాయి. జూన్​ నెలలో జీఎస్టీ కలెక్షన్లు 12 శాతం మేర వృద్ధి చెంది, మొత్తంగా రూ.1.61 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా మదుపర్ల సెంటిమెంట్​ను బలపరిచింది. ఫలితంగా దేశీయ స్టాక్​మార్కెట్లు గత నాలుగు రోజులుగా మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇదే ట్రెండ్​ సోమవారం కూడా కొనసాగుతోంది.

"యూఎస్​​ ఆర్థిక వ్యవస్థ ఎవరూ ఊహించని విధంగా పుంచుకుంది. మొదటి త్రైమాసికంలో యూఎస్​ జీడీపీ వృద్ధి అంచనాలకు మించి రాణించింది. దీనితో త్వరలో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందన్న అంచనాలు తప్పు అయ్యాయి. ఫలితంగా.. యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ 500 బీపీ రేటు పెంచినప్పటికీ.. దాని ప్రభావం స్టాక్​ మార్కెట్లు మీద పడలేదు."
- వీకే విజయ్​కుమార్​, చీఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ స్ట్రాటజిస్ట్​, జియోజిత్​ ఫైనాన్సియల్​ సర్వీసెస్​

Last Updated : Jul 3, 2023, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details