తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు.. 58వేల ఎగువకు సెన్సెక్స్.. పుంజుకున్న రూపాయి - share market news india

stock market today news telugu
స్టాక్ మార్కెట్స్​ లైవ్ అప్డేట్స్

By

Published : Oct 4, 2022, 9:39 AM IST

Updated : Oct 4, 2022, 5:02 PM IST

16:56 October 04

భారీ లాభాలు..
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు, రూపాయి పుంజుకోవడం వంటి కారణాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ ఉదయం 57,506.65 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 58,099.94 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1276.66 పాయింట్ల లాభంతో 58,065.47 వద్ద ముగిసింది. 17,147.45 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 386.95 పాయింట్లు ఎగబాకి 17,274.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,287.30 వద్ద గరిష్ఠాన్ని తాకింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా మాత్రమే నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌ రాణించిన షేర్లలో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.81.52 వద్ద నిలిచింది.

09:35 October 04

స్టాక్ మార్కెట్స్​ లైవ్ అప్డేట్స్

Stock market today news Telugu : అంతర్జాతీయ విపణుల నుంచి సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1060 పాయింట్లు పెరిగి 57, 850 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 310 పాయింట్లు ఎగబాకి 17,200 వద్ద కొనసాగుతోంది.
ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్​, ఎల్​ అండ్​ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, టీసీఎస్​, టాటా స్టీల్, బజాజ్ ఫిన్​సెర్వ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్ గ్రిడ్ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.

సోమవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆ జోరును కొనసాగిస్తూ.. ఆసియాలోని ప్రధాన మార్కెట్లు అయిన సియోల్, టోక్యో విపణులు మంగళవారం లాభాలతో ట్రేడవుతున్నాయి.
మరోవైపు.. బ్రెండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 0.53శాతం పెరిగి 89.33 డాలర్లుగా ఉంది.

Last Updated : Oct 4, 2022, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details