3.36 PM : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. దీనితో వరుస మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 496 పాయింట్లు లాభపడి 71,683 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 160 పాయింట్లు వృద్ధి చెంది 21,622 వద్ద ముగిసింది.
- లాభపడిన స్టాక్స్ : భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టాటాస్టీల్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ
- నష్టపోయిన షేర్లు : ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యోలు లాభాలతో స్థిరపడ్డాయి. షాంఘై, హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి. గురువారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
ముడిచమురు ధర
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.63 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.60 డాలర్లుగా ఉంది.
1.15 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 554 పాయింట్లు లాభపడి 71,741 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 165 పాయింట్లు వృద్ధి చెంది 21,628 వద్ద కొనసాగుతోంది.
12.20 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 432 పాయింట్లు లాభపడి 71,619 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 122 పాయింట్లు వృద్ధి చెంది 21,585 వద్ద కొనసాగుతోంది.
Stock Market Today January 17th 2024 : వరుస మూడు రోజుల నష్టాల తరువాత, శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకుని భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఐటీ, మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ రాణిస్తుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 579 పాయింట్లు లాభపడి 71,766 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 169 పాయింట్లు వృద్ధి చెంది 21,631 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, హిందూస్థాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ టెక్