3.40 PM :బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1628 పాయింట్లు నష్టపోయి 71,500 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయి 21,571 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.
2.25 PM :దేశీయ స్టాక్ మార్కెట్లు మరింతగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1427 పాయింట్లు నష్టపోయి 71,701 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 400 పాయింట్లు కోల్పోయి 21,631 వద్ద కొనసాగుతున్నాయి.
12.15 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1260 పాయింట్లు నష్టపోయి 71,868 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 357 పాయింట్లు కోల్పోయి 21,674 వద్ద కొనసాగుతున్నాయి.
10.46 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1039 పాయింట్లు నష్టపోయి 72,089 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 290 పాయింట్లు కోల్పోయి 21,742 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market Today January 17th 2024 : : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ మొదలైన వెంటనే సెన్సెక్స్ 1371 పాయింట్లు, నిఫ్టీ 395 పాయింట్లు వరకు నష్టపోయాయి. తరువాత నష్టాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 710 పాయింట్లు నష్టపోయి 72,417 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 200 పాయింట్లు కోల్పోయి 21,831 వద్ద కొనసాగుతున్నాయి.
మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం వల్ల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కూడా భారీగా పతనం అవుతున్నాయి.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టీసీఎస్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టైటాన్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ :హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్